భారతీయ విజ్ఞానంలో PG

ABN , First Publish Date - 2022-07-27T21:34:20+05:30 IST

పుణెలోని భీష్మ స్కూల్‌ ఆఫ్‌ ఇండిక్‌ స్టడీస్‌(Bhishma School of Indic Studies) (బీఎస్‌ఐఎస్‌) - మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఈ ప్రోగ్రామ్‌లకు ఏఐసీటీఈ, యూఎస్‌ఏలోని ఐఏసీడీఎస్సీ గుర్తింపులు ఉన్నాయి. అమెరికా(America)లోని భారతీయులు ఈ ప్రోగ్రామ్‌లు పూర్తిచేసి

భారతీయ విజ్ఞానంలో PG

పుణెలోని భీష్మ స్కూల్‌ ఆఫ్‌ ఇండిక్‌ స్టడీస్‌(Bhishma School of Indic Studies) (బీఎస్‌ఐఎస్‌) - మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఈ ప్రోగ్రామ్‌లకు ఏఐసీటీఈ, యూఎస్‌ఏలోని ఐఏసీడీఎస్సీ గుర్తింపులు ఉన్నాయి. అమెరికా(America)లోని భారతీయులు ఈ ప్రోగ్రామ్‌లు పూర్తిచేసి అక్కడ ఉద్యోగావకాశాలు పొందవచ్చు. అక్కడి ఆసుపత్రులు, దేవాలయాలు, కమ్యూనిటీ కళాశాలలు/ ఆర్గనైజేషన్స్‌, సేవాసంస్థలు, హెల్త్‌ మేనేజ్‌మెంట్‌/ కార్పొరేట్‌ సంస్థల్లో హిందూ కౌన్సెలర్స్‌, ఇండియన్‌/ వేదిక్‌/ హిందూ స్కాలర్స్‌, కౌటిల్య కార్పొరేట్‌/ పొలిటికల్‌/ ఎకనామిక్‌ స్కాలర్స్‌గా రాణించవచ్చు. హెచ్‌-1 వీసా ఉన్నవారి జీవిత భాగస్వామి (భార్య/ భర్త) ఈ కోర్సులు పూర్తిచేసి అమెరికాలో జాబ్‌ తెచ్చుకోవచ్చు. మనదేశంలో కూడా కెరీర్‌, బిజినెస్‌, ప్రొఫెషనల్‌, రిసెర్చ్‌, సోషల్‌ - కల్చరల్‌, గ్లోబల్‌ విభాగాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పుణె, ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్‌, యూఎ్‌సఏ సెంటర్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రోగ్రామ్‌లు ఆగస్టులో ప్రారంభమౌతాయి.


ప్రోగ్రామ్‌లు

  • మాస్టర్స్‌ ఇన్‌ ఇండియన్‌ నాలెడ్జ్‌ సిస్టమ్స్‌ (ఎంఐకేఎస్‌)
  • మాస్టర్స్‌ ఇన్‌ హిందూ స్టడీస్‌ (ఎంహెచ్‌డీఎస్‌)
  • మాస్టర్స్‌ ఇన్‌ కౌటిల్య పాలిటిక్స్‌ అండ్‌ ఎకనామిక్స్‌ (ఎంకేపీఈ)
  • మాస్టర్స్‌ ఇన్‌ వేదిక్‌ లిటరేచర్‌ (ఎంవీడీఎల్‌)


ప్రోగ్రామ్‌ వివరాలు: ఒక్కో ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. సెమిస్టర్‌కు నాలుగు చొప్పున మొత్తం 16 సబ్జెక్ట్‌లు ఉంటాయి. ప్రాజెక్ట్‌ వర్క్‌ కూడా ఉంటుంది. ప్రోగ్రామ్‌ మొత్తానికి 64 క్రెడిట్స్‌ నిర్దేశించారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానాలు అందుబాటులో ఉన్నాయి. సోమవారం నుంచి గురువారం వరకు ప్రతి రోజూ సాయంత్రం ఎనిమిదిన్నర నుంచి పది గంటల వరకు ఆన్‌లైన్‌ సెషన్స్‌; ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆఫ్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తారు. హిందీ మాధ్యమంలో బోధన ఉంటుంది. ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ సెషన్స్‌కు సంబంధించిన రికార్డింగ్‌లను అభ్యర్థుల ఈమెయిల్స్‌కు పంపుతారు. స్టడీ మెటీరియల్‌ ప్రధానంగా హిందీ మాధ్యమంలో ఉన్నప్పటికీ కొంత కంటెంట్‌ ఆంగ్ల మాధ్యమంలో కూడా ఉంటుంది. ప్రోగ్రామ్‌నకు నిర్దేశించిన మెటీరియల్‌ హార్డ్‌ కాపీ, ఈ-బుక్‌లను అభ్యర్థులకు అందిస్తారు. సెమిస్టర్‌ చివర్లో ప్రతి సబ్జెక్ట్‌లో రిటెన్‌ ఎగ్జామినేషన్‌ 60 మార్కులకు, అసైన్‌మెంట్‌ 20 మార్కులకు, ఓరల్‌ టెస్ట్‌ 20 మార్కులకు ఉంటాయి. రిటెన్‌ ఎగ్జామినేషన్‌ వ్యవధి రెండు గంటలు. ప్రతి సబ్జెక్ట్‌లో కనీసం 40 శాతం మార్కులు రావాలి. 

అర్హత: ఏదేని డిగ్రీ/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి నిబంధనలు లేవు. 


ముఖ్య సమాచారం

ప్రోగ్రామ్‌ ఫీజు: భారతీయ అభ్యర్థులకు ఏడాదికి రూ.48,000; విదేశీ అభ్యర్థులకు ఏడాదికి 900 యూఎస్‌ డాలర్లు

ఫీజులో రాయితీ: ముగ్గురు అభ్యర్థులు ఒక గ్రూప్‌గా అప్లయ్‌ చేసుకొంటే ఒక్కొక్కరికి మొదటి ఏడాది ప్రోగ్రామ్‌ ఫీజులో రూ.5000ల రాయితీ లభిస్తుంది.  

ఫెలోషిప్‌: సంస్థలో ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సు/ పూర్తిచేసిన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ.5000లు చెల్లిస్తారు.

పూర్తి సమాచారం కోసం సంప్రదించాల్సిన వాట్సప్‌ నెంబర్‌: 7875191270

వెబ్‌సైట్‌: www.bhishmaindics.org/masters

Updated Date - 2022-07-27T21:34:20+05:30 IST