AP ఫిషరీస్‌ యూనివర్సిటీలో BFSC

ABN , First Publish Date - 2022-10-03T21:22:35+05:30 IST

విజయవాడలోని ‘ఆంధ్రప్రదేశ్‌ ఫిషరీస్‌ యూనివర్సిటీ(Andhra Pradesh Fisheries University) (ఏపీఎఫ్‌యూ)’-బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ సైన్స్‌(బీఎఫ్‌ఎస్సీ) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌

AP ఫిషరీస్‌ యూనివర్సిటీలో BFSC

విజయవాడలోని ‘ఆంధ్రప్రదేశ్‌ ఫిషరీస్‌ యూనివర్సిటీ(Andhra Pradesh Fisheries University) (ఏపీఎఫ్‌యూ)’-బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ సైన్స్‌(బీఎఫ్‌ఎస్సీ) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ముతుకూరులోని ‘కాలేజ్‌ ఆఫ్‌ ఫిషరీ సైన్స్‌’లో అడ్మిషన్స్‌ ఇస్తారు. ఇక్కడ మొత్తం 29 సీట్లు ఉన్నాయి. వీటిలో 25 శాతం సీట్లను గ్రామీణ వ్యవసాయ కుటుంబాలకు చెందిన అభ్యర్థులకు ప్రత్యేకించారు. ఏపీ ఈఏపీసెట్‌ 2022 ర్యాంక్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఫిజికల్‌ సైన్సెస్‌, బయలాజికల్‌ సైన్సెస్‌/ నేచురల్‌ సైన్సెస్‌ ప్రధాన సబ్జెక్ట్‌లుగా ఇంటర్‌/ పన్నెండోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. డిసెంబరు 31 నాటికి జనరల్‌ అభ్యర్థులకు 17 నుంచి 22 ఏళ్ల మధ్య;  ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 17 నుంచి 25 ఏళ్ల మధ్య; దివ్యాంగులకు 17 నుంచి 27 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఏపీ ఈఏపీ సెట్‌ 2022 అర్హత తప్పనిసరి.


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.800; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.400

చివరి తేదీ: అక్టోబరు 10

వెబ్‌సైట్‌: www.fisheries.ap.gov.in

Updated Date - 2022-10-03T21:22:35+05:30 IST