Ambedkar Universityలో బీఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌

ABN , First Publish Date - 2022-12-03T14:22:57+05:30 IST

హైదరాబాద్‌లోని డా.బీ.ఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ(Dr.BR Ambedkar Open University)(బీఆర్‌ఏఓయూ) - బీఈడీ(B.ED) (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) ప్రోగ్రామ్‌లో మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్‌ అడ్మిషన్స్‌

Ambedkar Universityలో బీఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌
బీఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌

హైదరాబాద్‌లోని డా.బీ.ఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (Dr.BR Ambedkar Open University) (బీఆర్‌ఏఓయూ) - బీఈడీ(B.ED) (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) ప్రోగ్రామ్‌లో మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్‌ అడ్మిషన్స్‌(Spot admissions) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మెంటల్లీ రిటార్డెడ్‌, హియరింగ్‌ ఇంపెయిర్డ్‌, విజువల్లీ ఇంపెయిర్డ్‌ కేటగిరీల్లో మొత్తం 53 సీట్లు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు(ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు, చేసుకోనివారు) తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్‌లు, వాటి జిరాక్స్‌ కాపీలు, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోతో స్పాట్‌ అడ్మిషన్‌ కేంద్రానికి హాజరు కావాలి. ఇప్పటికే అడ్మిషన్‌ పొందినవారు తమ ప్రోగ్రామ్‌ సెంటర్‌ను మార్చుకోదలచుకుంటే స్లైడింగ్‌ ద్వారా అవకాశం కల్పిస్తారు. వీరు తమ ఐడీ కార్డ్‌/ అడ్మిట్‌ కార్డ్‌ వెంట తీసుకురావాలి.

సీట్ల వివరాలు: సికింద్రాబాద్‌లోని స్వీకార్‌ రీహాబిలిటేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హ్యాండీకా్‌ప్డలో 1, ట్రెయినింగ్‌ సెంటర్‌ ఫర్‌ ద టీచర్స్‌ ఆఫ్‌ ద విజువల్‌ హ్యాండీకా్‌ప్డలో 1, హెలెన్‌ కెల్లర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిసెర్చ్‌ అండ్‌ రీహాబిలిటేషన్‌ ఫర్‌ ద డిజెబుల్డ్‌ చిల్డ్రన్‌లో 2 సీట్లు; కర్నూలులోని నవజీవన్‌ స్పెషల్‌ స్కూల్‌ ఫర్‌ ద డెఫ్‌ అండ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లో 1 సీటు; తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళ విశ్వవిద్యాలయంలో 1 సీటు చొప్పున మొత్తం ఆరు సీట్లకు అభ్యర్థులందరూ పోటీపడవచ్చు.

  • తిరుపతిలోని రాష్ట్రీయ సేవా సమితిలో 1, శ్రీ పద్మావతి మహిళ విశ్వవిద్యాలయంలో 4 సీట్లు; హైదరాబాద్‌లోని ఠాకూర్‌ హరిప్రసాద్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిసెర్చ్‌ అండ్‌ రీహాబిలిటేషన్‌ ఫర్‌ ద మెంటల్లీ హ్యాండీక్యా్‌ప్డలో 3, చైల్డ్‌ గైడెన్స్‌ సెంటర్‌లో 8 సీట్లు; సికింద్రాబాద్‌లోని హెలెన్‌ కెల్లర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిసెర్చ్‌ అండ్‌ రీహాబిలిటేషన్‌ ఫర్‌ ద డిజెబుల్డ్‌ చిల్డ్రన్‌లో 9, స్వీకార్‌ అకాడమీ ఆఫ్‌ రీహాబిలిటేషన్‌ సైన్స్‌లో 9, ట్రెయినింగ్‌ సెంటర్‌ ఫర్‌ ద టీచర్స్‌ ఆఫ్‌ ద విజువల్‌ హ్యాండీకా్‌ప్డలో 3 సీట్లు; కర్నూలులోని నవజీవన్‌ స్పెషల్‌ స్కూల్‌ ఫర్‌ ద డెఫ్‌ అండ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లో 4 సీట్లు; కాకినాడలోని ఉమా ఎడ్యుకేషనల్‌ అండ్‌ టెక్నికల్‌ సొసైటీలో 2 సీట్లు; విశాఖపట్నంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఆంధ్ర యూనివర్సిటీలో 4 సీట్లు చొప్పున మొత్తం 47 సీట్లకు స్థానిక అభ్యర్థులు పోటీపడవచ్చు.

ముఖ్య సమాచారం

స్పాట్‌ అడ్మిషన్స్‌, స్లయిడింగ్‌: డిసెంబరు 8

స్లైడింగ్‌ సమయం: ఉదయం పది గంటల నుంచి పదకొండున్నర వరకు

స్పాట్‌ అడ్మిషన్స్‌ సమయం: మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి ఒకటిన్నర వరకు

స్లైడింగ్‌, స్పాట్‌ అడ్మిషన్స్‌ కేంద్రం: భవనం వెంకట్రాం ఆడిటోరియం, అకడమిక్‌ బ్లాక్‌, డా.బీ.ఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, రోడ్‌ నెం.46, జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌ - 500033

వెబ్‌సైట్‌: www.braou.ac.in

Updated Date - 2022-12-03T14:22:58+05:30 IST