Kaloji University: కళాశాలల్లో ఆయుష్‌ డిగ్రీ ప్రవేశాలు

ABN , First Publish Date - 2022-11-21T17:42:26+05:30 IST

వరంగల్‌లోని కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌(Kaloji Narayana Rao University of Health Sciences)(కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్‌) - తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ అనుబంధ కళాశాలల్లో ఆయుష్‌ డిగ్రీ కోర్సుల్లో

Kaloji University: కళాశాలల్లో ఆయుష్‌ డిగ్రీ ప్రవేశాలు
ఆయుష్‌ డిగ్రీ ప్రవేశాలు

వరంగల్‌లోని కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌(Kaloji Narayana Rao University of Health Sciences)(కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్‌) - తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ అనుబంధ కళాశాలల్లో ఆయుష్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా బీఏఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీఎన్‌వైఎస్‌ కోర్సుల్లో కాంపిటెంట్‌ అథారిటీ కోటా సీట్లు భర్తీ చేయనున్నారు. నీట్‌ యూజీ 2022 స్కోర్‌, కౌన్సెలింగ్‌, డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా అడ్మిషన్స్‌ ఇస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సీట్ల వివరాలను కౌన్సెలింగ్‌ నాటికి ప్రకటిస్తారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్‌లు వర్తిస్తాయి. ఒక్కో ప్రోగ్రామ్‌ వ్యవధి అయిదున్నరేళ్లు.

నీట్‌ యూజీ 2022 కటాఫ్‌: మొత్తం 720 మార్కులకు గాను జనరల్‌ అభ్యర్థులకు 117; జనరల్‌ కేటగిరీ దివ్యాంగులకు 105; ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 93 మార్కులను కటా్‌ఫగా నిర్దేశించారు.

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ, జువాలజీ), ఇంగ్లీష్‌ ప్రధాన సబ్జెక్ట్‌లుగా ఇంటర్‌/ పన్నెండోతరగతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. బీయూఎంఎస్‌ కోర్సులో ప్రవేశానికి పదోతరగతి/ ఇంటర్‌ స్థాయిలో ఉర్దూ/ అరబిక్‌/ పర్షియన్‌ లాంగ్వేజ్‌ను ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి. ఇంటర్‌ స్థాయిలో జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ అభ్యర్థులకు 50 శాతం; జనరల్‌ కేటగిరీ దివ్యాంగులకు 45 శాతం; బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు ఉండాలి. అభ్యర్థుల వయసు డిసెంబరు 31 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి.

ముఖ్య సమాచారం

రిజిస్ట్రేషన్‌, వెరిఫికేషన్‌ ఫీజు: జనరల్‌, బీసీ అభ్యర్థులకు రూ.2,500; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2,000

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 20

వెబ్‌సైట్‌: www.knruhs.telangana.gov.in

Kaloji_Narayana_Rao_Univers.gif

Updated Date - 2022-11-21T17:42:27+05:30 IST