AP Police Recruitment: కానిస్టేబుల్స్‌, ఎస్‌ఐ పోస్టులు.. ఖాళీలెన్నంటే..

ABN , First Publish Date - 2022-12-01T13:05:03+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ లెవెల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (Andhra Pradesh State Level Police Recruitment Board) (ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ)- రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సివిల్‌, ఏపీఎస్‌పీ విభాగాల్లో

AP Police Recruitment: కానిస్టేబుల్స్‌, ఎస్‌ఐ పోస్టులు.. ఖాళీలెన్నంటే..
ఖాళీలెన్నంటే..

ఖాళీలు 6511

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ లెవెల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (Andhra Pradesh State Level Police Recruitment Board) (ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ)- రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సివిల్‌, ఏపీఎస్‌పీ విభాగాల్లో మొత్తం 6,511 పోస్టులు ప్రకటించారు. సివిల్‌ విభాగంలో 315 ఎస్‌ఐ (సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌) పోస్టులు; 3580 పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులు ఉన్నాయి. ఏపీఎస్‌పీ విభాగంలో 96 ఆర్‌ఎస్‌ఐ(రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్స్‌ ఆఫ్‌ పోలీస్‌) పోస్టులు; 2520 పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులు ఉన్నాయి. సివిల్‌ విభాగంలోని పోస్టులకు పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీఎస్‌పీ విభాగంలోని పోస్టులకు పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ రిటెన్‌ టెస్ట్‌, ఫిజికల్‌ మెజర్మెంట్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌, ఫైనల్‌ రిటెన్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ టెస్ట్‌లో అర్హత సాధించిన వారిని మాత్రమే ఫిజికల్‌ మెజర్మెంట్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌లకు అనుమతిస్తారు. వీటిలో అర్హత పొందినవారిని ఫైనల్‌ రిటెన్‌ ఎగ్జామినేషన్‌కు పిలుస్తారు.

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌లు, రిజర్వ్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌లు

అర్హత: జనరల్‌ అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇంటర్‌/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై జూలై 1 నాటికి డిగ్రీ చదువుతూ ఉండాలి. అభ్యర్థుల వయసు 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్‌ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

ప్రిలిమినరీ రిటెన్‌ టెస్ట్‌: ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్‌లో పదోతరగతి స్థాయిలో అర్థమెటిక్‌, రీజనింగ్‌/ మెంటల్‌ ఎబిలిటీ అంశాలనుంచి ప్రశ్నలు అడుగుతారు. రెండో పేపర్‌లో డిగ్రీ స్థాయిలో జనరల్‌ స్టడీస్‌ నుంచి ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు. పేపర్‌కు వంద మార్కులు నిర్దేశించారు. మొత్తం మార్కులు 200. అభ్యర్థులు రెండు పేపర్లలో అర్హత సాధించాల్సి ఉంటుంది.

ఫైనల్‌ రిటెన్‌ ఎగ్జామినేషన్‌: ఇందులో నాలుగు పేపర్లు ఉంటాయి. సివిల్‌, ఏపీఎ్‌సపీ విభాగాలకు మొదటి రెండు పేపర్లు ఒకేలా ఉంటాయి. చివరి రెండు పేపర్లలో మార్కుల తేడా ఉంటుంది. మొదటిది ఇంగ్లీష్‌ పేపర్‌. రెండోది తెలుగు/ ఉర్దూ పేపర్‌. ఈ రెండు పేపర్లూ డిస్ర్కిప్టివ్‌ విధానంలో ఉంటాయి. డిగ్రీ స్థాయి ప్రశ్నలు అడుగుతారు. వీటిలో అర్హత పొందితే చాలు. వీటిలో అర్హత పొందకపోతే మిగిలిన పేపర్లను పరిశీలించరు. మూడో పేపర్‌లో పదోతరగతి స్థాయి అర్థమెటిక్‌, రీజనింగ్‌/ మెంటల్‌ ఎబిలిటీ అంశాలనుంచి; నాలుగో పేపర్‌లో డిగ్రీ స్థాయిలో జనరల్‌ స్టడీస్‌ అంశాలనుంచి ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు అడుగుతారు. సివిల్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్లకు మూడు, నాలుగు పేపర్లలో ఒక్కోదానిలో 200 మార్కులకు; అదే ఏపీఎస్‌పీ రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు ఒక్కోదానిలో 100 మార్కులకు ప్రశ్నపత్రాలు ఇస్తారు.

ఎంపిక: సివిల్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాలకు ఫైనల్‌ రిటెన్‌ ఎగ్జామినేషన్‌లో మూడు, నాలుగు పేపర్లలో మొత్తం 400 మార్కులకుగాను అత్యధిక స్కోర్‌ సాధించిన వారిని ఎంపిక చేస్తారు.

  • ఏపీఎస్‌పీ ఆర్‌ఎస్‌ఐ పోస్టులకు ఫైనల్‌ రిటెన్‌ ఎగ్జామినేషన్‌లో మూడు, నాలుగు పేపర్లలో మొత్తం 200 మార్కులకుగాను వచ్చిన స్కోరుకు, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌లో వంద మార్కులకు సాధించిన స్కోర్‌ను కలుపుతారు. అత్యధిక స్కోర్‌ సాధించిన వారిని ఎంపిక చేస్తారు.

ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌, బీసీ అభ్యర్థులకు రూ.600; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.300

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: డిసెంబరు 14

దరఖాస్తుకు చివరి తేదీ: 2023 జనవరి 18

ప్రిలిమినరీ రిటెన్‌ టెస్ట్‌ హాల్‌ టికెట్‌ డౌన్‌లోడింగ్‌: 2023 ఫిబ్రవరి 5

ప్రిలిమినరీ రిటెన్‌ టెస్ట్‌ తేదీ: 2023 ఫిబ్రవరి 19

PolicemenI.gif

పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలు

అర్హత: జనరల్‌ అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్‌/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పదోతరగతి ఉత్తీర్ణులై ఇంటర్‌/ తత్సమాన కోర్సు చదివి పరీక్షలు రాస్తే చాలు. అభ్యర్థుల వయసు 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్‌ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

ప్రిలిమినరీ రిటెన్‌ టెస్ట్‌, ఫైనల్‌ రిటెన్‌ ఎగ్జామినేషన్‌: ప్రిలిమినరీ రిటెన్‌ టెస్ట్‌లో ఒక పేపర్‌ ఉంటుంది. ఇందులో అన్నీ ఇంటర్‌ స్థాయి ప్రశ్నలే అడుగుతారు. ఇంగ్లీష్‌, రీజనింగ్‌, మెంటల్‌ ఎబిలిటీ, జనరల్‌ సైన్స్‌, భారతదేశ చరిత్ర, సంస్కృతి, భారత జాతీయోద్యమం, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, పదోతరగతి స్థాయి అర్థమెటిక్‌, జాతీయ - అంతర్జాతీయ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు. ఫైనల్‌ రిటెన్‌ ఎగ్జామినేషన్‌ కూడా ఇలాగే ఉంటుంది.

  • సివిల్‌, ఏపీఎస్‌పీ విభాగాల్లో కానిస్టేబుల్‌ పోస్టులకు నిర్వహించే ప్రిలిమినరీ టెస్ట్‌ ఒకేలా ఉంటుంది. దీనికి 200 మార్కులు నిర్దేశించారు. కానీ ఫైనల్‌ రిటెన్‌ ఎగ్జామినేషన్‌లో మాత్రం మార్కుల్లో తేడా ఉంటుంది. సివిల్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు 200 మార్కులకు; ఏపీఎ్‌సపీ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు 100 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది.

ఎంపిక: సివిల్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు ఫైనల్‌ రిటెన్‌ ఎగ్జామినేషన్‌లో సాధించిన స్కోర్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

  • ఏపీఎస్‌పీ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఫైనల్‌ రిటెన్‌ ఎగ్జామినేషన్‌లో సాధించిన మార్కులకు ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌లో వచ్చిన మార్కులు కలిపి అత్యధిక స్కోర్‌ సాధించినవారిని ఎంపిక చేస్తారు.

ముఖ్య సమాచారం

ఫీజు: జనరల్‌, బీసీ అభ్యర్థులకు రూ.300; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.150

దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 28

ప్రిలిమినరీ రిటెన్‌ టెస్ట్‌ హాల్‌ టికెట్‌ డౌన్‌లోడింగ్‌: 2023 జనవరి 9 నుంచి

ప్రిలిమినరీ రిటెన్‌ టెస్ట్‌ తేదీ: జనవరి 22

longjump.gif

ఫిజికల్‌ మెజర్మెంట్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌లు: సివిల్‌ విభాగంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టులకు 1600 మీటర్ల పరుగు; వంద మీటర్ల పరుగు లేదా లాంగ్‌ జంప్‌ను నిర్దేశిత సమయంలో పూర్తిచేయాల్సి ఉంటుంది. వీటిలో అర్హత సాధిస్తే చాలు. ఏపీఎస్‌పీ విభాగంలో ఆర్‌ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టులకు 1600 మీటర్ల పరుగు, వంద మీటర్ల పరుగు, లాంగ్‌ జంప్‌లను నిర్దేశిత సమయంలో పూర్తిచేయాలి. వీటికి మార్కులు ఉంటాయి.

వెబ్‌సైట్‌: slprb.ap.gov.in

Updated Date - 2022-12-01T13:07:23+05:30 IST