Sainik Schools: దరఖాస్తు గడువు పొడిగింపు

ABN , First Publish Date - 2022-12-02T16:32:24+05:30 IST

దేశవ్యాప్తంగా ఉన్న సైనిక పాఠశాలల్లో ఆరోతరగతి, తొమ్మిదోతరగతి ప్రవేశాలకు ఉద్దేశించిన ఆలిండియా సైనిక్‌ స్కూల్స్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ (Allindia Sainik Schools Entrance Examination)(ఏఐఎస్‌ఎస్‌ఈఈ) 2023 దరఖాస్తు గడువును పొడిగించారు. ఈ పరీక్షని నేషనల్‌ టెస్టింగ్‌

Sainik Schools: దరఖాస్తు గడువు పొడిగింపు
దరఖాస్తు గడువు పొడిగింపు

దేశవ్యాప్తంగా ఉన్న సైనిక పాఠశాలల్లో ఆరోతరగతి, తొమ్మిదోతరగతి ప్రవేశాలకు ఉద్దేశించిన ఆలిండియా సైనిక్‌ స్కూల్స్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ (Allindia Sainik Schools Entrance Examination)(ఏఐఎస్‌ఎస్‌ఈఈ) 2023 దరఖాస్తు గడువును పొడిగించారు. ఈ పరీక్షని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్వహిస్తోంది. ఆరోతరగతిలో బాలికలు కూడా చేరవచ్చు. తొమ్మిదోతరగతిలో ప్రవేశానికి బాలురు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. సైనిక పాఠశాలల పరిధుల్లోని స్థానిక విద్యార్థులకు 67 శాతం సీట్లు కేటాయించారు. మిగిలిన 33 శాతం సీట్లకు ఇతర రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పోటీపడవచ్చు. ఎన్‌జీఓలు/ ప్రైవేట్‌ పాఠశాలలు/ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పనిచేసే 18 నూతన సైనిక పాఠశాలల్లో కూడా ఈ నోటిఫికేషన్‌ ద్వారానే ఆరోతరగతి అడ్మిషన్స్‌ నిర్వహిస్తారు.

అర్హత

  • ప్రస్తుతం అయిదోతరగతి చదువుతున్న బాలురు, బాలికలు ఆరోతరగతి ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి 2023 మార్చి 31 నాటికి పది నుంచి పన్నెండేళ్ల మధ్య వయసు ఉండాలి. అంటే 2011 ఏప్రిల్‌ 1 నుంచి 2013 మార్చి 31 మధ్య జన్మించి ఉండాలి.

  • ఈ విద్యా సంవత్సరంలో ఎనిమిదోతరగతి చదువుతున్న బాలురు తొమ్మిదోతరగతి ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి 2023 మార్చి 31 నాటికి 13 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. అంటే 2008 ఏప్రిల్‌ 1 నుంచి 2010 మార్చి 31 మధ్య జన్మించి ఉండాలి.

ఏఐఎస్‌ఎస్‌ఈఈ వివరాలు

  • దీనిని ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. అన్నీ మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలే అడుగుతారు. సమాధానాలను పెన్సిల్‌తో ఓఎంఆర్‌ పత్రం మీద గుర్తించాలి. రుణాత్మక మార్కులు లేవు. ఈ పరీక్షలో అర్హత సాధించాలంటే ఒక్కో అంశంలో కనీసం 25 శాతం, మొత్తమ్మీద 40 శాతం మార్కులు రావాలి.

sainik-schools-girls.gif

ఆరోతరగతి ఎంట్రెన్స్‌: పరీక్ష సమయం రెండున్నర గంటలు. మొత్తం మార్కులు 300. ఇందులో మేథమెటిక్స్‌ నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. వీటికి ఒక్కోదానికి 3 మార్కులు కేటాయించారు. ఇంటెలిజెన్స్‌, లాంగ్వేజ్‌, జనరల్‌ నాలెడ్జ్‌ అంశాల నుంచి ఒక్కోదానిలో 25 ప్రశ్నలు అడుగుతారు. వీటికి ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. ఆంగ్ల మాధ్యమంతోపాటు అభ్యర్థి ఎంచుకొన్న ప్రాంతీయ భాషలో(తెలుగు, హిందీ, ఉర్దూ తదితర భాషలు) ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం రెండున్నర గంటలు.

తొమ్మిదోతరగతి: దీనిని ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే నిర్వహిస్తారు. పరీక్ష సమయం 3 గంటలు. మొత్తం మార్కులు 400. మేథమెటిక్స్‌ నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు. వీటికి ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి. ఇంటెలిజెన్స్‌, ఇంగ్లీష్‌, జనరల్‌ సైన్స్‌, సోషల్‌ సైన్స్‌ అంశాల నుంచి ఒక్కోదానిలో 25 ప్రశ్నలు ఇస్తారు. వీటికి ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు నిర్దేశించారు. పరీక్ష సమయం మూడు గంటలు.

ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.650; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 5

కరెక్షన్‌ విండో ఓపెన్‌: డిసెంబరు 7 నుంచి 11 వరకు

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, కరీంనగర్‌, అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం

ఏఐఎస్‌ఎస్‌ఈఈ తేదీ: 2023 జనవరి 8న

వెబ్‌సైట్‌: aissee.nta. nic.in

NTA.gif

Updated Date - 2022-12-02T16:32:25+05:30 IST