All India సైనిక్‌ స్కూల్స్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌

ABN , First Publish Date - 2022-10-28T14:20:08+05:30 IST

దేశవ్యాప్తంగా ఉన్న 33 సైనిక పాఠశాలల్లో ఆరోతరగతి, తొమ్మిదోతరగతి ప్రవేశాలకు ఉద్దేశించిన ఆలిండియా సైనిక్‌ స్కూల్స్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌(ఏఐఎ్‌సఎ్‌సఈఈ) 2023 నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ పరీక్షని నేషనల్‌ టెస్టింగ్‌

All India సైనిక్‌ స్కూల్స్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌
ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌

దేశవ్యాప్తంగా ఉన్న 33 సైనిక పాఠశాలల్లో ఆరోతరగతి, తొమ్మిదోతరగతి ప్రవేశాలకు ఉద్దేశించిన ఆలిండియా సైనిక్‌ స్కూల్స్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌(ఏఐఎస్‌ఎస్‌ఈఈ) 2023 నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ పరీక్షని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్వహిస్తోంది. సైనిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది. ఇవి సీబీఎస్‌ఈ గుర్తింపు ఉన్న రెసిడెన్షియల్‌ స్కూళ్లు. ఆరోతరగతిలో బాలికలు కూడా చేరవచ్చు. తొమ్మిదోతరగతిలో ప్రవేశానికి బాలురు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. సైనిక పాఠశాలల పరిధుల్లోని స్థానిక విద్యార్థులకు 67 శాతం సీట్లు కేటాయించారు. మిగిలిన 33 శాతం సీట్లకు ఇతర రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పోటీపడవచ్చు. ప్రతి సైనిక పాఠశాలలో ఆరోతరగతిలో 10 శాతం/ గరిష్ఠంగా 10 సీట్లను బాలికలకు ప్రత్యేకించారు. ఎన్‌జీఓలు/ ప్రైవేట్‌ పాఠశాలలు/ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పనిచేసే 18 నూతన సైనిక పాఠశాలల్లో కూడా ఈ నోటిఫికేషన్‌ ద్వారానే ఆరోతరగతి అడ్మిషన్స్‌ నిర్వహిస్తారు. సైనిక పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, ఇండియన్‌ నేవల్‌ అకాడమీ తదితరాల్లో చేరేందుకు సన్నద్ధం చేస్తారు.

te.jpg

అర్హత వివరాలు: ప్రస్తుతం అయిదోతరగతి చదువుతున్న బాలురు, బాలికలు ఆరోతరగతి ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి 2023 మార్చి 31 నాటికి పది నుంచి పన్నెండేళ్ల మధ్య వయసు ఉండాలి. అంటే 2011 ఏప్రిల్‌ 1 నుంచి 2013 మార్చి 31 మధ్య జన్మించి ఉండాలి.

  • ఈ విద్యా సంవత్సరంలో ఎనిమిదోతరగతి చదువుతున్న బాలురు తొమ్మిదోతరగతి ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి 2023 మార్చి 31 నాటికి 13 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. అంటే 2008 ఏప్రిల్‌ 1 నుంచి 2010 మార్చి 31 మధ్య జన్మించి ఉండాలి.

ఏఐఎస్‌ఎస్‌ఈఈ వివరాలు: దీనిని ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. అన్నీ మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలే అడుగుతారు. సమాధానాలను పెన్సిల్‌తో ఓఎంఆర్‌ పత్రం మీద గుర్తించాలి. రుణాత్మక మార్కులు లేవు. ఈ పరీక్షలో అర్హత సాధించాలంటే ఒక్కో అంశంలో కనీసం 25 శాతం, మొత్తమ్మీద 40 శాతం మార్కులు రావాలి.

ఆరోతరగతి ఎంట్రెన్స్‌ వివరాలు: పరీక్ష సమయం రెండున్నర గంటలు. మొత్తం మార్కులు 300. ఇందులో మేథమెటిక్స్‌ నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. వీటికి ఒక్కోదానికి 3 మార్కులు కేటాయించారు. ఇంటెలిజెన్స్‌, లాంగ్వేజ్‌, జనరల్‌ నాలెడ్జ్‌ అంశాలనుంచి ఒక్కోదానిలో 25 ప్రశ్నలు అడుగుతారు. వీటికి ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. ఆంగ్ల మాధ్యమంతోపాటు అభ్యర్థి ఎంచుకొన్న ప్రాంతీయ భాషలో(తెలుగు, హిందీ, ఉర్దూ తదితర భాషలు) ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం రెండున్నర గంటలు

తొమ్మిదో తరగతి ఎంట్రెన్స్‌ వివరాలు: దీనిని ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే నిర్వహిస్తారు. పరీక్ష సమయం 3 గంటలు. మొత్తం మార్కులు 400. మేథమెటిక్స్‌ నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు. వీటికి ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి. ఇంటెలిజెన్స్‌, ఇంగ్లీష్‌, జనరల్‌ సైన్స్‌, సోషల్‌ సైన్స్‌ అంశాల నుంచి ఒక్కోదానిలో 25 ప్రశ్నలు ఇస్తారు. వీటికి ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు నిర్దేశించారు. పరీక్ష సమయం మూడు గంటలు.

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.650; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 30

కరెక్షన్‌ విండో ఓపెన్‌: డిసెంబరు 2 నుంచి 6 వరకు

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, కరీంనగర్‌, అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం

ఏఐఎస్‌ఎస్‌ఈఈ తేదీ: 2023 జనవరి 8న

వెబ్‌సైట్‌: aissee.nta.nic.inఏఐఎస్‌ఎస్‌ఈఈ

Updated Date - 2022-10-28T14:23:10+05:30 IST