No transfers: టీచర్ల కొరతకు సర్దుబాటు మందు! బదిలీలు లేనట్టే!

ABN , First Publish Date - 2022-12-01T10:45:09+05:30 IST

ఉపాధ్యాయుల(No transfers) కొరతను అధిగమించేందుకు పాఠశాల విద్యాశాఖ సర్దుబాటు చర్యలు చేపట్టింది. అవసరమైన పాఠశాలలకు ఇతర స్కూళ్ల నుంచి ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై పంపాలని

No transfers: టీచర్ల కొరతకు సర్దుబాటు మందు! బదిలీలు లేనట్టే!
బదిలీలు లేనట్టే!

పదో తరగతి ఉంటే ప్రతి సబ్జెక్టుకూ టీచర్‌

ఇతర స్కూళ్ల నుంచి పంపాలని ఉత్తర్వులు

ఉన్నత పాఠశాలల్లో 6,578 ఖాళీలు

సర్దుబాటు చర్యలతో బదిలీలు లేనట్టే

అమరావతి, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల(No transfers) కొరతను అధిగమించేందుకు పాఠశాల విద్యాశాఖ సర్దుబాటు చర్యలు చేపట్టింది. అవసరమైన పాఠశాలలకు ఇతర స్కూళ్ల నుంచి ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై పంపాలని ఆదేశిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. పదో తరగతి వరకు ఉన్న పాఠశాలల్లో కచ్చితంగా ప్రతి సబ్జెక్టుకూ టీచర్‌ (teachers) ఉండాలని స్పష్టం చేసింది. అలాగే కొత్తగా 3, 4, 5 తరగతులను విలీనం చేసిన పాఠశాలల్లో ఆ తరగతులకు స్కూల్‌ అసిస్టెంట్లను పంపాలని సూచించింది. ఫౌండేషన్‌, ఫౌండేషన్‌ ప్లస్‌ పాఠశాలలకు ఎస్జీటీలను అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా ఈ నెల 3లోగా సర్దుబాటు ప్రక్రియను పూర్తిచేయాలని స్పష్టంచేసింది. దీంతో ఇటీవల ఎస్జీటీల నుంచి స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందిన టీచర్లంతా ఉన్నత పాఠశాలలకు వెళ్లిపోయే అవకాశం ఏర్పడింది. సాధారణంగా పదోన్నతి ఇచ్చిన వెంటనే అందుకు తగ్గ పాఠశాలలో పోస్టింగ్‌ ఇవ్వాలి. కానీ బదిలీలు చేస్తామని చెబుతూ వచ్చిన ప్రభుత్వం ఇటీవల పదోన్నతులు ఇచ్చిన టీచర్లను అవే స్థానాల్లో కొనసాగిస్తూ వచ్చింది. ఇప్పుడు వారిని సర్దుబాటు చేయాలని ఆదేశించడంతో ఇక ఈ విద్యా సంవత్సరంలో బదిలీలు ఉండవని పరోక్షంగా వెల్లడించింది. అలాగే ఇటీవల పాఠశాల విద్యాశాఖ వేసిన అంచనా ప్రకారం 3 నుంచి 10 తరగతులున్న ఉన్నత పాఠశాలల్లో 6,578 మంది స్కూల్‌ అసిస్టెంట్ల అవసరం ఉంది.

Updated Date - 2022-12-01T10:45:10+05:30 IST