నేటి నుంచి బహుజన బతుకమ్మ

ABN , First Publish Date - 2022-09-24T07:12:52+05:30 IST

అస్పృశ్యత – కులవివక్షలను వ్యతిరేకిస్తూ కులనిర్మూలన లక్ష్యంగా ఈ ఏడు బహుజన బతుకమ్మ జరుగనున్నది. నేడు ఉదయం 11 గం.లకు గన్‌పార్క్‌లో తెలంగాణ...

నేటి నుంచి బహుజన బతుకమ్మ

అస్పృశ్యత – కులవివక్షలను వ్యతిరేకిస్తూ కులనిర్మూలన లక్ష్యంగా ఈ ఏడు బహుజన బతుకమ్మ జరుగనున్నది. నేడు ఉదయం 11 గం.లకు గన్‌పార్క్‌లో తెలంగాణ అమరులకు నివాళులర్పించిన అనంతరం, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సా. 4 గంటలకు ఆర్ట్స్‌ కాలేజీ ప్రాంగణంలో బహుజన బతుకమ్మ కార్యక్రమాలు ఆరంభమవుతాయి. ప్రారంభ సమావేశానికి మహాత్మ జ్యోతిరావు పూలె– సావిత్రిబాయిల మునిమనవరాలు నీతాతాయి హోళే పూలె ముఖ్య అతిథి. 25న నారాయణపేట్‌ జిల్లా పోలేపల్లిలో కార్యక్రమాలు మొదలై, 26న సూర్యాపేట జిల్లా ఇస్తాళ్ళపురం, 27న జనగాం జిల్లా మంచుప్పల, 27న జనగాం పట్టణం బతుకమ్మకుంట, 28న భద్రాద్రి కొత్తగూడం జిల్లా గుండాల, 29న సిద్దిపేట జిల్లా ఖాజీపురం, 30న యాదాద్రి–భువనగిరి జిల్లా వెల్మజాల గ్రామం, అక్టోబర్‌ 1న వేములవాడ, 2న హైద్రాబాద్‌ మల్లాపూర్‌, 3న యాదాద్రి–భువనగిరి జిల్లా పిళ్ళైపల్లిలో కొనసాగి, 4వ తేదీన ములుగు జిల్లా మేడారంతో ముగుస్తాయి. బహుజన బతుకమ్మ కార్యక్రమాల్లో ఈ క్రింది అంశాలనేకం లేవనెత్తుతున్నాం. ఉత్పత్తి, పునరుత్పత్తి, పిల్లల పెంపకంలో భాగమైన స్త్రీలకు అన్ని రంగాల్లో సమానహక్కులుండాలని, భూమి లేని దళితులకు భూమి, ప్రైవేటురంగంలో రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేద్దాం. వంశ పారంపర్య కుల వృత్తులను నిరసిస్తూ ‘వృత్తి స్వేచ్ఛ – నివాస స్వేచ్ఛ – వివాహ స్వేచ్ఛలను ఎత్తిపడతాం. స్త్రీలను కట్టడి చేయడానికి ఉద్దేశించిన అన్ని రకాల దురాచార అవశేషాలను వ్యతిరేకిద్దాం. మద్యం ఉత్పత్తులను, అశ్లీల ఛానళ్ళను తరిమి వేద్దాం. హిందూత్వ పేరిట సమాజాన్ని విభజించవద్దని కోరుతూ లౌకికవాదాన్ని ఎత్తిపడుదాం. నవధాన్య సంస్కృతి – నవసూత్ర ప్రతిపాదనలతో ప్రజల్లోకి వస్తున్న బహుజన బతుకమ్మలో పాల్గొనేందుకు అందరినీ ఆహ్వానిస్తున్నాం.

– విమలక్క (ప్రజాగాయని) 

బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటి

Read more