భర్తను చంపి ఏడాదిన్నర పాటు ఇంటి ముందున్న గడ్డి వాములో దాచిన భార్య.. చివరకు ఒకే ఒక్క మిస్టేక్‌తో ఎలా దొరికిపోయిందంటే..!

ABN , First Publish Date - 2022-10-31T15:20:50+05:30 IST

భర్త సోదరుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ దారుణానికి తెగించింది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా కడతేర్చింది. అనంతరం భర్త మృతదేహాన్ని ఇంటి ముందున్న గడ్డి వాములో దాచింది.

భర్తను చంపి ఏడాదిన్నర పాటు ఇంటి ముందున్న గడ్డి వాములో దాచిన భార్య.. చివరకు ఒకే ఒక్క మిస్టేక్‌తో ఎలా దొరికిపోయిందంటే..!

భర్త సోదరుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ దారుణానికి తెగించింది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా కడతేర్చింది. అనంతరం భర్త మృతదేహాన్ని ఇంటి ముందున్న గడ్డి వాములో దాచింది. ఏడాదిన్నర పాటు గడ్డివాములోనే ఉంచిన తర్వాత అస్థి పంజరాన్ని తీసుకెళ్లి అడవిలో పడేసింది. ఆ అస్థిపంజరమే ఆ మహిళను పోలీసులకు పట్టించింది. చివరకు ఆ మహిళ నిజం అంగీకరించి కటకటాల పాలైంది. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

రేవా జిల్లాలోని మౌగంజ్‌లో నివసించే రామ్ సుశీల్ (40) పదేళ్ల క్రితం రంజన అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి పిల్లలు లేరు. నాలుగేళ్ల క్రితం సుశీల్ సోదరుడు గులాబ్‌తో రంజన వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. ఆ విషయం తెలుసుకున్న సుశీల్.. భార్యను నిలదీశాడు. దీంతో రంజన, గులాబ్ కలిసి ఓ పథకం వేశారు. సుశీల్‌ను చంపేసి అతని వాటా ఆస్థిని కూడా తామే అనుభవించాలనుకున్నారు. ఏడాదిన్నర క్రితం రామ్ సుశీల్ హత్యకు గురయ్యాడు. రంజన సమోసాలో ఎలకల మందు కలిపి భర్త చేత తినిపించింది. అది తిన్న కొద్దిసేపటికే సుశీల్ మృతి చెందాడు. గులాబ్‌తో కలిసి సుశీల్ మృతదేహాన్ని ఇంటి ముందు ఉన్న గడ్డి వాము మధ్యలో రంజన దాచింది.

ఏడాదిన్నర తర్వాత గడ్డి వాములో అస్థిపంజరం మాత్రమే ఉండడం చూసి దానిని తీసుకెళ్లి అడవిలో పారేశారు. కొద్ది రోజుల తర్వాత అడవిలో అస్థిపంజరం గురించి పోలీసులకు సమాచారం అందింది. వారు ఆ అస్థిపంజరానికి డీఎన్‌ఏ టెస్ట్ చేయించారు. అనంతరం చుట్టు పక్కల ప్రాంతాల్లో విచారించడం ప్రారంభించారు. మౌగంజ్‌ గ్రామంలో విచారించగా సుశీల్ అనే వ్యక్తి ఏడాదిన్నర నుంచి కనిపించడం లేదని బయటపడింది. గ్రామ ప్రజల ద్వారా రంజన, గులాబ్ వివాహేతర సంబంధం గురించి పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు రంజనను అదుపులోకి తీసుకుని విచారించారు. తాను, గులాబ్ కలిసి సుశీల్‌ను చంపినట్టు ఆమె అంగీకరించింది. దీంతో వారిద్దరినీ పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2022-10-31T15:20:53+05:30 IST