చేతిలో 3 కేజీల బంగారం.. 7 రోజుల పాటు నిద్రపోకుండా 3200 కిలోమీటర్ల ప్రయాణం.. చివరకు..!

ABN , First Publish Date - 2022-11-29T16:16:17+05:30 IST

ఆ వ్యక్తి తన స్నేహితుడిని నమ్మించి మోసం చేశాడు.. అతడి దగ్గరే చోరీకి పాల్పడ్డాడు.. స్నేహితుడి ఇంట్లో నుంచి ఏకంగా 3 కేజీల బంగారాన్ని కాజేశాడు.. ఆ బంగారం మొత్తాన్ని అమ్మేందుకు ఏకంగా ఏడు రోజుల పాటు నిద్రలేకుండా నాలుగు రాష్ట్రాలు తిరిగాడు.. చివరకు..

చేతిలో 3 కేజీల బంగారం.. 7 రోజుల పాటు నిద్రపోకుండా 3200 కిలోమీటర్ల ప్రయాణం.. చివరకు..!

ఆ వ్యక్తి తన స్నేహితుడిని నమ్మించి మోసం చేశాడు.. అతడి దగ్గరే చోరీకి పాల్పడ్డాడు.. స్నేహితుడి దగ్గర నుంచి ఏకంగా 3 కేజీల బంగారాన్ని కాజేశాడు.. ఆ బంగారం మొత్తాన్ని అమ్మేందుకు ఏకంగా ఏడు రోజుల పాటు నిద్రలేకుండా నాలుగు రాష్ట్రాలు తిరిగాడు.. అంత బంగారాన్ని అమ్మడం అతడికి సాధ్యం కాలేదు.. చివరకు ఇంటి దగ్గరే దాచాలనుకుని పోలీసులకు దొరికిపోయాడు.. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ ఘటన జరిగింది.

చమన్‌గంజ్‌లో నివాసం ఉంటున్న నదీమ్‌కు అత్యవసరంగా డబ్బు అవసరమైంది. దీంతో తన దగ్గర ఉన్న మూడు కేజీల బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బు తీసుకోవాలనుకున్నాడు. ఈ నెల 23న బంగారం తీసుకుని బ్యాంకుకు బయల్దేరాడు. మార్గమధ్యంలో అతడికి హృతిక్ అనే స్నేహితుడు కలిశాడు. తనకు బిర్హానా రోడ్డులో ఒక వ్యక్తి తెలుసని, అతడు బంగారం తీసుకుని తక్కువ వడ్డీకే ఎక్కువ డబ్బులు ఇస్తాడని చెప్పాడు. స్నేహితుడిని నమ్మిన నదీమ్ తన దగ్గర ఉన్న నగలను హృతిక్‌కు ఇచ్చాడు. అయితే హృతిక్ ఆ నగలను పట్టుకుని పారిపోయాడు. స్నేహితుడు ఎంతకీ తిరిగిరాకపోవడంతో అనుమానం వచ్చిన నదీమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

నగలతో పారిపోయిన నదీమ్ ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లి ఓ హోటల్‌లో బస చేశాడు. బంగారాన్ని ఎవరికి అమ్మాలో అతడికి అర్థం కాలేదు. పట్టుబడతానేమోనని భయం ఒకవైపు, బంగారం భద్రత గురించి ఆందోళన మరొకవైపు. దీంతో అతడు వరుసగా 7 రోజులు నిద్రపోలేదు. బంగారం అమ్మేందుకు లక్నో నుంచి ప్రయాగ్‌రాజ్‌కు, అక్కడి నుంచి ఢిల్లీకి, ఆ తర్వాత గుజరాత్‌కు, అక్కడి నుంచి మధ్యప్రదేశ్‌కు ప్రయాణించాడు. అంత బంగారం ఎలా అమ్మాలో తెలియక చివరకు కాన్పూర్‌లోని తన ఇంట్లోనే దాయాలనుకున్నాడు. తన ఇంటి మీద నిఘా వేసిన పోలీసులకు దొరికిపోయాడు.

Updated Date - 2022-11-29T16:16:19+05:30 IST