కడుపు నొప్పితో బాధపడుతున్న కూతురిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లిన తల్లి.. అక్కడ బయటపడిన షాకింగ్ విషయం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-11-21T20:15:44+05:30 IST

ఆ బాలిక వయసు 18 సంవత్సరాలు.. పదో తరగతితో చదువు ఆపేసి ఇంటి దగ్గరే ఉంటోంది.. కొద్ది రోజులుగా ఆ బాలిక కడుపునొప్పితో బాధపడుతోంది.. దీంతో తల్లి ఆ బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లింది.. అన్ని పరీక్షలూ చేసిన వైద్యుడు షాకింగ్ విషయం చెప్పాడు..

కడుపు నొప్పితో బాధపడుతున్న కూతురిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లిన తల్లి.. అక్కడ బయటపడిన షాకింగ్ విషయం ఏంటంటే..

ఆ బాలిక వయసు 18 సంవత్సరాలు.. పదో తరగతితో చదువు ఆపేసి ఇంటి దగ్గరే ఉంటోంది.. కొద్ది రోజులుగా ఆ బాలిక కడుపునొప్పితో బాధపడుతోంది.. దీంతో తల్లి ఆ బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లింది.. అన్ని పరీక్షలూ చేసిన వైద్యుడు ఆమె ఆరు నెలల గర్భవతి అని తేల్చారు.. షాక్‌కు గురైన తల్లి కూతురిని నిలదీయగా ఆ బాలిక అసలు విషయం చెప్పింది.. ఆరు నెలల క్రితం బాత్రూమ్‌లో స్నానం చేస్తుండగా పొరుగింటి యువకుడు తనపై అత్యాచారం చేసినట్టు బయటపెట్టింది.

రాజస్థాన్‌లోని జైపూర్‌కు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన బాధిత బాలిక ఆరు నెలల క్రితం స్నానం చేయడానికని బాత్రూమ్‌కు వెళ్లింది. ఆ సమయంలో పొరుగింటి యువకుడు బలవంతంగా బాత్రూమ్‌లోకి ప్రవేశించాడు. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాలిక ఎవరికీ అత్యాచారం గురించి చెప్పలేదు. నెల రోజుల తర్వాత ఆ యువకుడు తన గదిని ఖాళీ చేసి వెళ్లిపోయాడు.

శుక్రవారం బాధితురాలికి కడుపునొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి చూపించగా అసలు విషయం బయటపడింది. బాలిక ఆరు నెలల తర్వాత గర్భవతి అని డాక్టర్ చెప్పారు. బాలికను నిలదీస్తే తనపై జరిగిన అత్యాచారం గురించి చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నిందితుడిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం అన్వేషిస్తున్నారు.

Updated Date - 2022-11-21T20:15:44+05:30 IST

Read more