Rajasthan: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతి.. ఇంతలో స్కూటర్‌పై వచ్చిన యువకుడు ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-12-06T20:12:56+05:30 IST

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఆకతాయిల ఆగడాలు శృతిమించుతున్నాయి. రోడ్లపై వెళ్తున్న అమ్మాయిలను వేధిస్తూ వారిని భయాందోళనలకు గురి చేస్తున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Rajasthan: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతి.. ఇంతలో స్కూటర్‌పై వచ్చిన యువకుడు ఏం చేశాడంటే..

మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు చేస్తున్నా ఆకతాయిల ఆగడాలు ఆగడం లేదు. ముఖ్యంగా రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఆకతాయిల ఆగడాలు శృతిమించుతున్నాయి. రోడ్లపై వెళ్తున్న అమ్మాయిలను వేధిస్తూ వారిని భయాందోళనలకు గురి చేస్తున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో ఆధారంగా నిందితుడి కోసం పోలీసులు అన్వేషణ ప్రారంభించారు.

జైపూర్‌లోని శిప్రా పథ్ మానసరోవర్ ప్రాంతంలో ఓ యువతి రోడ్డుపై నడిచి వెళ్తుండగా.. ఓ యువకుడు వెనుక నుంచి స్కూటీపై వచ్చి ఆమె చెయ్యి పట్టుకుని లాగాడు. ఆ యువతి చేయి విదిలించడంతో ఆ యువకుడు వెళ్లిపోయాడు. ఈ ఘటన ఆ రోడ్డులో అమర్చిన సీసీటీవీ కెమేరాలో రికార్డు అయింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. స్కూటీ నెంబర్ ఆధారంగా నిందితుడిని రవిగుప్తాగా గుర్తించారు. పోలీసుల విచారణలో నిందితుడు తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2022-12-06T20:12:57+05:30 IST