`నేను బతికే ఉన్నాను బాబోయ్`.. సోదరి మోసానికి షాకై 14 ఏళ్లుగా న్యాయపోరాటం చేస్తున్న వ్యక్తి.. చివరకు..

ABN , First Publish Date - 2022-11-29T18:42:38+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని బండాకు చెందిన ఓ మహిళ దారుణ మోసానికి పాల్పడింది. తను సోదరుడు చనిపోయినట్లు చూపించి, అతని భూమిని దక్కించుకుంది. ఆ విషయం తెలుసుకున్న సోదరుడు షాక్‌కు గురయ్యాడు. తాను బతికే ఉన్నానని నిరూపించుకునేందుకు 14 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాడు.

`నేను బతికే ఉన్నాను బాబోయ్`.. సోదరి మోసానికి షాకై 14 ఏళ్లుగా న్యాయపోరాటం చేస్తున్న వ్యక్తి.. చివరకు..

ఉత్తరప్రదేశ్‌లోని బండాకు చెందిన ఓ మహిళ దారుణ మోసానికి పాల్పడింది. తను సోదరుడు చనిపోయినట్లు చూపించి, అతని భూమిని దక్కించుకుంది. అంతేకాదు దానిని వేరే వ్యక్తికి అమ్మేసింది. ఆ విషయం తెలుసుకున్న సోదరుడు షాక్‌కు గురయ్యాడు. తాను బతికే ఉన్నానని నిరూపించుకునేందుకు 14 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాడు. చివరకు తహసీల్ కోర్టులో కేసు వేసి 14 ఏళ్ల తర్వాత తాను బతికే ఉన్నానని నిరూపించగలిగాడు. తన సోదరిపై చీటింగ్ కేసు వేశాడు.

యూపీలోని సక్తల్ గ్రామానికి చెందిన షేరా(69) అనే వ్యక్తి తన భార్య మరణానంతరం కొడుకుతో కలిసి వేరే ప్రాంతానికి కూలి పనుల కోసం వెళ్లాడు. కొడుకు కాస్త పెద్దయ్యాక 2008లో తిరిగి తన గ్రామానికి వెళ్లాడు. అయితే అప్పటికే తనకు వారసత్వంగా వచ్చిన భూమి వేరే వారి ఆస్థిగా మారినట్టు తెలుసుకున్నాడు. విచారిస్తే తాను చనిపోయినట్టు నకిలీ పత్రాలు సమర్పించి, ఆ భూమిని స్వంత సోదరి దక్కించుకుందని, వెంటనే దానిని వేరే వ్యక్తికి అమ్మేసిందని తెలుసుకుని నివ్వెరపోయాడు. కొడుకుతో కలిసి న్యాయపోరాటం ప్రారంభించాడు. అధికారుల చుట్టూ తిరిగాడు. 14 ఏళ్ల తర్వాత ఇరుపక్షాల వాదనలు విన్న తహసీల్దార్ ఈ కేసులో న్యాయం షేరా వైపు ఉందని గ్రహించి అతనికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. అయినా ఇప్పటికీ భూమి షేరాకు స్వాధీనం చేయలేదు. దీంతో షేరా తన సోదరిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చీటింగ్ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  

Updated Date - 2022-11-29T18:42:40+05:30 IST