ప్రేయసి కోసం రిస్క్ చేశాడు.. చివరకు ఇలా మిగిలాడు.. 4 నెలల క్రితం అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-12-31T14:27:31+05:30 IST

మధ్యప్రదేశ్‌కు చెందిన ఆ కుర్రాడు ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు.. తన క్లాస్‌మేట్‌తో ప్రేమాయణం సాగిస్తున్నాడు.. నాలుగు నెలల కిందట అతను తన స్నేహితుడితో కలిసి గ్వాలియర్ కోటను చూసేందుకు వెళ్లాడు.. తన ప్రేయసిని సర్‌ప్రైజ్ చేసేందుకు ఓ వీడియో రూపొందించాలనుకున్నాడు..

ప్రేయసి కోసం రిస్క్ చేశాడు.. చివరకు ఇలా మిగిలాడు.. 4 నెలల క్రితం అసలేం జరిగిందంటే..

మధ్యప్రదేశ్‌కు (Madhya Pradesh) చెందిన ఆ కుర్రాడు ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు.. తన క్లాస్‌మేట్‌తో ప్రేమాయణం సాగిస్తున్నాడు.. నాలుగు నెలల కిందట అతను తన స్నేహితుడితో కలిసి గ్వాలియర్ కోటను చూసేందుకు వెళ్లాడు.. తన ప్రేయసిని సర్‌ప్రైజ్ చేసేందుకు ఓ వీడియో రూపొందించాలనుకున్నాడు.. తన స్నేహితుడు వీడియో షూట్ చేస్తుండగా.. ఆ కుర్రాడు కోట గోడ నుంచి కిందకు దూకుతున్నట్టు నటించాలనుకున్నాడు.. అయితే దురదృష్టవశాత్తూ నిజంగానే లోయలో పడిపోయాడు.. నాలుగు నెలల అన్వేషణ తర్వాత అతడి అస్థిపంజరం పోలీసులకు దొరికింది (Madhya Pradesh Crime News).

సాత్నాకు చెందిన సందీప్ కుష్వాహా (17) అనే విద్యార్థి తన స్నేహితుడు సునీల్‌తో కలిసి నాలుగు నెలల క్రితం గ్వాలియర్ కోటను (Gwalior Fort) చూసేందుకు వెళ్లాడు. తన ప్రేయసిని సర్‌ప్రైజ్ చేసేందుకు ఓ వీడియో రూపొందించాలనుకున్నాడు. సునీల్ వీడియో షూట్ చేస్తుండగా సందీప్ కోట గోడ నుంచి కిందకు దూకుతున్నట్టు నటించాలనుకున్నాడు. అయితే దురదృష్టవశాత్తూ కాలు జారి నిజంగానే 70 అడుగుల లోయలో పడిపోయాడు. భయపడిన సునీల్ ఎవరికీ చెప్పకుండా ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు. తమ కుమారుడు కనిపించకపోవడంతో సందీప్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

సునీల్‌తో కలిసి సందీప్ వెళ్లినట్టు తెలుసుకున్నారు. సునీల్‌ను విచారించగా అసలు విషయం బయటపడింది. సునీల్ తన మొబైల్‌తో రికార్డు చేసిన వీడియోను పోలీసులకు చూపించాడు. గ్వాలియర్ చేరుకున్న పోలీసులు స్థానిక అధికారులతో కలిసి అన్వేషణ ప్రారంభించారు. చివరకు లోయలో సందీప్ అస్థిపంజరాన్ని కనుగొన్నారు. డీఎన్ఏ టెస్ట్ నిర్వహించగా అది సందీప్‌దేనని తేలింది.

Updated Date - 2022-12-31T14:27:31+05:30 IST

Read more