NewYear: కొత్త ఏడాది 2023లో ఈ 5 మనీ సేవింగ్ టిప్స్ పాటిస్తే తిరుగుండదు!

ABN , First Publish Date - 2022-12-31T16:23:17+05:30 IST

చూస్తుండగానే మరో ఏడాది-2022 కాలచక్రంలో కలసిపోయింది. మరుపురాని ఆనంద క్షణాలు కొన్ని.. విషాదాలు మిగిల్చిన చేదు జ్ఞాపకాలు కొన్నింటి కలయికతో పాత సంవత్సరం కరిగిపోయింది. నూతన ఏడాది వచ్చేసింది.

NewYear: కొత్త ఏడాది 2023లో ఈ 5 మనీ సేవింగ్ టిప్స్ పాటిస్తే తిరుగుండదు!

చూస్తుండగానే మరో ఏడాది-2022 కాలచక్రంలో కలసిపోయింది. మరుపురాని ఆనంద క్షణాలు కొన్ని.. విషాదాలు మిగిల్చిన చేదు జ్ఞాపకాలు కొన్నింటి కలయికతో పాత సంవత్సరం కరిగిపోయింది. నూతన ఏడాది వచ్చేసింది. వ్యక్తిగతంగా పాత ఏడాది ఎలా గడిచినా.. కొత్త ఆశలు, లక్ష్యాలతో 2023కు (New Year 2023) స్వాగతం పలకాల్సిన తరుణం ఇది. ముఖ్యంగా భవిష్యత్‌ ఆర్థిక ప్రణాళికల (Financial Plannigs) విషయంలో స్పష్టమైన తీర్మానాలతో (Resolutions) కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాల్సిన తరుణమిది. ఎవరి ప్రణాళికలు, ఆలోచనలు వారికి వ్యక్తిగతంగా ఎలా ఉన్నా కొత్త ఏడాది 2023లో ఉపయోగపడే ముఖ్యమైన మనీ సేవింగ్స్ టిప్స్ (Money saving tips) కొన్ని ఉన్నాయి. వాటిపై మీరూ ఒక లుక్కేయండి !

నిజానికి సంపాదించడం (Earning) కంటే ఖర్చు (Expensives) పెట్టడం చాలా ఈజీ. వ్యయాలు పరిమితి దాటితే మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవడం అనివార్యం. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకుంటే దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాలను (Financial goals) చేరుకోవడం కూడా కష్టమే. అందుకే వ్యక్తుల ఆదాయాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. మరి కొత్త ఏడాది-2023లో ఆర్థిక తీర్మానాలను రూపొందించుకోవడంలో కీలకమైన ఈ 5 మనీ టిప్స్ ఉపయోగపడతాయేమో ఒకసారి పరిశీలించుకోండి..

1. అనవసర వ్యయాలు తగ్గించండి..

డబ్బును పొదుపు చేయడంలో వ్యక్తిగత వ్యయాలను వీలైనంత మేర తగ్గించుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం కాఫీ మొదలుకొని ఇంట్లో సరుకుల నుంచి నెలవారీ చెల్లింపుల వరకు ఖర్చులన్నింటినీ ట్రాక్ చేయాలి. డేటా మొత్తాన్ని ఒక పేపర్‌పై పెట్టి అవసరం లేకపోయినా ఖర్చుపెడుతున్నవాటిని గుర్తించాలి. ఆ వ్యయాల్లో ఎంతవరకు తగ్గించుకోగలం, ఎంత పొదుపు చేయగలమనే అంశాలపై దృష్టిపెట్టాలి.

2. బడ్జెట్‌లోనే సేవింగ్స్ ఉండాలి..

డబ్బు పొదుపు (Money saving) చేయాలనుకునేవారు నెలవారీ బడ్జెట్‌ను రూపొందించుకోవడం చాలా ముఖ్యం. తద్వారా ఆదాయంలో వ్యయాలపై ఒక స్పష్టత వస్తుంది. ఈ అవగాహనతో ఇతర ఖర్చుల విషయంలో అతిగా పోకుండా బడ్జెట్‌లోనే సేవింగ్స్ ఉండేలా ప్లానింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వ్యవహరించడం అలవర్చుకుంటే ‘డబ్బు పొదుపు’ (Money savings) మంచి విజయాన్ని అందుకోవచ్చు.

3. వ్యయాలు తగ్గించుకునే మార్గాలను అన్వేషించాలి..

అనుకున్నంత మొత్తంలో పొదుపు చేయలేకపోతున్నామని ఫీలయ్యేవారంతా వ్యయాలను తగ్గించడంపై దృష్టిసారించాలి. ఇందులో భాగంగా వినోదం, బయట రెస్టారెంట్లలో తినడం వంటి అనవసర వ్యయాలను తగ్గించుకునే ప్రయత్నించాలి. అవసరంలేని వస్తువుల కొనుగోళ్లను నియంత్రించుకోవడం ద్వారా పొదుపు ప్రణాళికను పక్కాగా అమలు పరచవచ్చు. ఇలాంటి ఖర్చుల ఆదా కోసం ప్రత్యేక ప్లాన్‌ సిద్ధం చేసుకుంటే మరింత ఉపయోగకరం.

4. సేవింగ్స్ లక్ష్యాలపై క్లారిటీ ముఖ్యం..

డబ్బు పొదుపు చేయడంలో సరైన లక్ష్యాలు చేసుకోవడం అతిముఖ్యం. స్వల్ప, దీర్ఘకాలాల్లో ఎంతమేర సేవ్ చేయాలనుకుంటున్నదానిపై ఒక క్లారిటీ ఉండాలి. లక్ష్యాలను చేరుకోవాలంటే ఎంతకాలం పడుతుంది, ఎంతమొత్తం పొదుపు చేయాలనేదానిపై స్పష్టతతో సేవింగ్స్ ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం.

5. ఏం చెయ్యాల్లో నిర్ణయించుకోవాలి...

వ్యయాలు, ఆదాయ ప్రణాళికలతో అంతిమంగా ఏం చేయాలనుకుంటున్నది చాలా ముఖ్యం. పొదుపు డబ్బు దేనికోసం కేటాయించబోతున్నారనేదానిపై స్పష్టతతో ముందడుగు వేయాలి. ఇల్లు, భూమి, కారు లేక రిటైర్మెంట్ ప్లానింగ్ ఏదైనా అందుకు తగ్గట్టు పొదుపు దిశగా అడుగులు వేయాలి.

Updated Date - 2022-12-31T16:31:10+05:30 IST