‘యువగళం పాదయాత్ర విజయవంతం చేద్దాం’

ABN , First Publish Date - 2022-12-31T22:55:42+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈనెల 27 నుంచి రాష్ట్రంలో నిర్వహించే యువగళంను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని టీడీపీ ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు పిలుపుని చ్చారు.

‘యువగళం పాదయాత్ర విజయవంతం చేద్దాం’
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న టీడీపీ నాయకులు

నరసాపురం టౌన్‌, డిసెంబరు 31: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈనెల 27 నుంచి రాష్ట్రంలో నిర్వహించే యువగళంను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని టీడీపీ ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు పిలుపుని చ్చారు. శనివారం పార్టీ కార్యాలయంలో యువగళం పాదయాత్రకు సంబంధించిన పోస్టర్‌ను పార్టీ శ్రేణులతో కలసి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ అరాచకపాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు సుమారు 400 రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్ల మేర యాత్ర సాగుతుందన్నారు. తొలుత పట్టణంలోని ఆరో వార్డులో ‘ఇదేం ఖర్మ’ నిర్వహించారు. ఇంటిం టికి వెళ్లి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. పాలూరి బాబ్జి, జక్కం శ్రీమన్నారాయణ, కొల్లు పెద్దిరాజు, కొప్పాడ రవి, కొరడా పాపారావు, ఎం.రవి, షేక్‌ హుస్సేన్‌, మల్లాడి మూర్తి, సంకు భాస్కర్‌, మురళి, సుజాత, బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T22:55:42+05:30 IST

Read more