యువ చైతన్యంతో సమసమాజ స్థాపన

ABN , First Publish Date - 2022-11-18T23:31:24+05:30 IST

సమ సమాజ స్థాపనకు యువ చైతన్యమే పునాది అని ఆర్డీవో దాసి రాజు అన్నారు. భీమవరం శాఖా గ్రంథాలయంలో శుక్రవారం యువజనోత్సవ సభలో ఆయన మాట్లాడారు.

యువ చైతన్యంతో సమసమాజ స్థాపన
భీమవరంలో జరిగిన కార్యక్రమంలో ఆర్డీవో దాసి రాజు

భీమవరం టౌన్‌, నవంబరు 18: సమ సమాజ స్థాపనకు యువ చైతన్యమే పునాది అని ఆర్డీవో దాసి రాజు అన్నారు. భీమవరం శాఖా గ్రంథాలయంలో శుక్రవారం యువజనోత్సవ సభలో ఆయన మాట్లాడారు. నాటి స్వాతంత్య్ర ఉద్యమంలో యువకులే సభలను సాగించా రని గుర్తుచేశారు. యువకులుగా దేశభవిష్యత్‌కు కృషి చెయ్యాలన్నారు. భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. విద్యార్ధులకు పాటలపోటీలు, శాస్త్రీయ భరతనాట్యం పోటీలు నిర్వహించారు. సుంకర దాసు, కంచెడపు లక్ష్మణ్‌, ఎస్‌.కృష్ణమోహన్‌, జీపీసీ.శేఖర్‌రాజు, వడు పు గోపి, నందమూరి రాజేష్‌ను ఆర్డీవో సత్కరించారు. నిర్వాహకుడు చెరుకువాడ రంగ సాయి, ఎస్‌ వెంకటేశ్వరరావు, అరసవల్లి సుబ్రహ్మణ్యం, కఠారి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

నరసాపురం టౌన్‌: పట్టణంలోని గ్రంథాలయంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో 300 మంది విద్యార్ధులు హాజరయ్యారు. లైబ్రేరియన్‌ కుమారి, శాస్త్రవేత్త సుబ్బారావు, వెంకటరమణ, లావణ్య, సుదీర్‌మోహన్‌, మూర్తిరాజు పాల్గొన్నారు.

పాలకొల్లు అర్బన్‌: పుస్తక పఠనంతో ప్రపంచ విజ్ఞానం పొందవచ్చని కవులు, రచయితలు అన్నారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం శాఖా గ్రంథాలయం లో కవి సమ్మేళనం నిర్వహించారు. లైబ్రేరియన్‌ వి.శాంతకుమారి అధ్యక్షతన జరిగిన విశ్రాంత ఉపాధ్యాయుడు పొలిశెట్టి గోపాలకృష్ణ గోఖలే మాట్లాడారు. కొలాటి పెద్దిరాజు, మామిడిశెట్టి శ్రీనివాసరావు, తాళాబత్తుల వెంకటేశ్వరరావు కవితలను వినిపించారు. మానాపురం సత్యనారాయణ, మండెల అప్పలరాజు నమన్వయ కర్తలుగా వ్యవహరించారు. జి సీతారామ్‌, వీఎస్‌ఎన్‌ మూర్తి, పెద్దిరాజు, తమ్మినీడి సత్యనారాయణరావు, పాఠకులు పాల్గొన్నారు. ఆదిత్య కళాశాలలో నిర్వహించిన చిత్రలేఖనం పోటీలలో 25 మంది విద్యా ర్థులు పాల్గొన్నారు. ప్రిన్సిపాల్‌ కె.గంగాధర్‌ పోటీల్లో పాల్గొన్న వారిని అభినందించారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ జి.లక్ష్మీనారాయణ, ఎం.సురేష్‌, ఐ.రవికిరణ్‌, బి.కుమార్‌ వెంకటేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-18T23:31:27+05:30 IST