రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని యువకుడి మృతి

ABN , First Publish Date - 2022-09-25T04:12:53+05:30 IST

రైలు నుంచి జారిప డిన గుర్తు తెలియని యువకుడు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని యువకుడి మృతి

ఏలూరు రూరల్‌, సెప్టెంబరు 24 : రైలు నుంచి జారిప డిన గుర్తు తెలియని యువకుడు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సుమారు 35 నుంచి 40 ఏళ్ళ వయస్సున్న  ఈ యువకుడు శనివారం ఉదయం వట్లూరు రైల్వే స్టేషన్‌ సమీపంలో రైలు నుంచి జారి పడి తీవ్ర గాయాల తో ఉండటంతో స్థానికులు  108 ద్వారా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సుమారు 5.4 అడుగుల ఎత్తు, కోల ముఖం  కల్గి ఉన్నాడని రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ విజయలక్ష్మి తెలిపారు. నిందితుడు బిహార్‌కు చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 90523 48489 నంబర్‌కు తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. 


Read more