వైసీపీ పాలనలో అభివృద్ధికి నోచుకోని ముస్లిం మైనార్టీలు
ABN , First Publish Date - 2022-06-26T05:56:01+05:30 IST
వైసీపీ పాలనలో ముస్లింలకు ఎటువంటి సంక్షేమ పథకాలు లేకుండా వారి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి విమర్శించారు.

భీమవరం అర్బన్, జూన్ 25 : వైసీపీ పాలనలో ముస్లింలకు ఎటువంటి సంక్షేమ పథకాలు లేకుండా వారి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి విమర్శించారు. భీమవరం పట్టణ టీడీపీ ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్కే రభాని అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో శనివారం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిఽథిగా ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో చంద్రబాబు ముస్లింల సంక్షేమానికి అనేక పథకాల ద్వారా అభివృద్ధికి కృషి చేశారన్నారు. రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు, పట్టణ కన్వీనర్ వేండ్ర శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం వేధింపులకు ఓ ముస్లిం కుటుంబం రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ముస్లిం మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ నౌషాద్ మాట్లాడుతూ జగన్ పాదయాత్రలో ఎన్నికల హామీలో భాగంగా ఇస్లామిక్ బ్యాంక్ గత ప్రభుత్వ హయాంలో రూ.50 వేలు ఉండే దుల్హన్ పథకాన్ని వైఎస్ఆర్ దుల్హన్ కింద లక్ష రుపాయాలు ఇస్తామని ముస్లింలను నమ్మించి మోసం చేశారన్నారు. కార్యక్రమంలో మైనార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ ఖలీల్, ముస్లిం మైనార్టీ నాయకులు అస్లాం బాషా, ఎస్డీ నసీమాబేగం, ఆలీషా తదితరులు పాల్గొన్నారు.