ఆకాశంలో..అద్భుతం

ABN , First Publish Date - 2022-06-26T06:02:22+05:30 IST

ఆకాశంలో..అద్భుతం

ఆకాశంలో..అద్భుతం
ఆకాశంలో తిరుగుతున్న గ్రహాలు

158 ఏళ్ల తరువాత ఒకే వరుసలో ఐదు గ్రహాలు
వీక్షకులకు నేడు, రేపు కనువిందు

ఉండి, జూన్‌ 25: ఆకాశంలో అద్భుతం జరగబోతోంది. 158 ఏళ్ల తర్వాత ఓకే వరుసలోకి ఐదు గ్రహాలు రాబోతున్నాయి. జనవిజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి, రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు గాదిరాజు రంగరాజు తెలిపిన వివరాల ప్రకారం..సూర్య కుటుంబంలో భూమితో పాటు ఎనిమిది గ్రహాలు సూర్యునిచుట్టూ తిరుగుతాయి. అందులో ఐదు ఆది, సోమ వారాల్లో ఒకే వరుసలో కనిపిస్తాయని నాసా నిపుణులు చెబుతున్నారని ఆయన తెలిపారు. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలు ఒక దాని వెనుక మరొకటి కనువిందు చేయ నున్నాయి. తెల్లవారుజామున సూర్యో దయానికి ముందు తూర్పు దిశ నుంచి నైౖరుతి దిశ వరకు వరుసగా ఈఐదు గ్రహాలు కనిపించి కనువిందు చేస్తాయన్నారు. 1864లో ఒకసారి వచ్చాయని, మళ్లీ 158 ఏళ్ల తర్వాత ఆదృశ్యం ఇపుడు కనిపిస్తోందని, వీటికి చందమామ కూడా తోడవనుందని పేర్కొన్నారు. ఈఅద్బుత దృశ్యాన్ని బైనాక్యులర్‌తో గానీ, మామూలుగా గానీ తిలకించి మధు రానుభూతి పొందాలన్నారు. ఉదయం 5 నుంచి 7 లోపు బాగా కనిపిస్తాయన్నారు. మళ్లీ 2040లో ఇది ఆవిష్కృతమవుతుందన్నారు.


Updated Date - 2022-06-26T06:02:22+05:30 IST