ఎన్టీఆర్‌ పేరు మార్పుపై నిరశన దీక్ష

ABN , First Publish Date - 2022-09-29T05:38:40+05:30 IST

విజయవాడలోని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చడం హేయమైన చర్యని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వలవల బాబ్జి విమర్శించారు.

ఎన్టీఆర్‌ పేరు మార్పుపై నిరశన దీక్ష
తాడేపల్లిగూడెంలో నిరశన దీక్షలో టీడీపీ ఇన్‌చార్జ్‌ వలవల బాబ్జి తదితరులు

తాడేపల్లిగూడెం అర్బన్‌, సెప్టెంబరు 28 : విజయవాడలోని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చడం హేయమైన చర్యని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వలవల బాబ్జి విమర్శించారు. బుధవారం పట్టణంలోని శేషమహల్‌ సెంటర్‌ లో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి నిరాహార దీక్ష చేపట్టా రు. యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు కొసాగించాలని డిమాండ్‌ చేశారు. పార్టీ నాయకులు పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, పరిమి రవికుమార్‌, పోతుల అన్నవరం, పాతూరి రాంప్రసాద్‌చౌదరి, మద్దిపాటి ధర్మేంద్ర, గంధం సతీష్‌, సబ్నీసు కృష్ణమోహన్‌,షేక్‌ బాజీ, వాడపల్లి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

Read more