వెళ్తున్న రైలు ఎక్కబోయి..

ABN , First Publish Date - 2022-08-04T05:46:31+05:30 IST

ఆకివీడులో వెళ్తున్న రైలు ఎక్కబోయి జారిపడి ఒక యువకుడు మృతి చెందాడు.

వెళ్తున్న రైలు ఎక్కబోయి..
బంధువులను ప్రశ్నిస్తున్న ఆర్పీఎఫ్‌, జీఆర్పీ పోలీసులు

 జారిపడి యువకుడి మృతి.. ఆకివీడులో ఘటన
ఆకివీడు, ఆగస్టు 3 : ఆకివీడులో వెళ్తున్న రైలు ఎక్కబోయి జారిపడి ఒక  యువకుడు మృతి చెందాడు.  రైల్వే పోలీసులు తెలిపిన వివరాలివి..  ఏలూరు నాగేంద్ర (మసీద్‌ దగ్గర) కాలనీకి చెందిన తమ్మిశెట్టి హరి (21) ఏలూరులో కూరగాయలు వ్యాపారం చేస్తుంటాడు, రెండు రోజుల క్రితం ఇంటి నుంచి  పారిపోయి వచ్చాడు. అతను ఆకివీడులో ఉన్నట్టు తెలిసి తీసుకెళ్లేందుకు బుధవారం నలుగురు బంధువులు వచ్చారు. ఉదయం 8:15 గంటల సమయంలో స్థానిక సిద్ధాపురం రైల్వేగేటు వద్ద వారిని చూసిన హరి కంగారుగా అదే సమయంలో నాగర్‌సోల్‌ నుంచి నరసాపురం వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ ఎక్కేందుకు ప్రయత్నించాడు. అయితే పట్టుతప్పి జారిపోవడంతో సుమారు రెండు కిలో మీటర్లు రైలు ఈడ్చుకెళ్లింది. చివరకు గుమ్ములూరు రైల్వే గేటు సమీపంలో మృతదేహం పడిపోయింది. వెనకాలే బంధువులు నలుగురు అక్కడకు  చేరుకున్నారు. రైల్వేగేట్‌ సిబ్బంది రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత మృతుడి కుటుంబ సభ్యులు వచ్చారు. ఆర్పీఎఫ్‌ ఎస్‌ఐ చింతపల్లి త్రిమూర్తులు, జీఆర్పీ హెడ్‌ కానిస్టేబుల్‌ సూరిబాబు వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భీమవరం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-08-04T05:46:31+05:30 IST