ఇక తాడోపేడో

ABN , First Publish Date - 2022-01-24T05:04:53+05:30 IST

సర్కారుపై తాడోపేడో తేల్చు కోవడానికి తెలుగు దేశం సిద్ధమవుతోంది.

ఇక తాడోపేడో

 నేడు టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం
(ఏలూరు–ఆంధ్రజ్యోతి) : సర్కారుపై తాడోపేడో తేల్చు కోవడానికి తెలుగు దేశం సిద్ధమవుతోంది. ప్రత్యేక కార్యా చరణ అమలు చేసేందుకు సన్నద్ధమవు తోంది. దీనికిగాను ఉమ్మడి వేదిక మీదకు వచ్చి అటోఇటో తేల్చుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు తెలుగుదేశం ఏలూరు, నరసాపురం, రాజమహేం ద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గాల సమన్వయ సమావేశం సోమవారం ఏలూరులో జరగనుంది. గోదావరి జిల్లాల రైతులను ఆదుకునేందుకు పూర్తి చేయాల్సిన పోలవరం దిక్కుమొక్కూ లేకుండా పోయిందని, కనీసం పనులను వేగవంతం చేయలేకపోతున్నారని తెలుగుదేశం ఇప్పటికే ఆక్షేపించింది. డెల్టా రైతులకు సమృద్ధిగా నీటి సరఫరా విషయం లోనూ వైఫల్యాలు స్పష్టంగా కనిపి స్తున్నాయి. ఆఖరుకి ధాన్యం కొనుగోలు సొమ్ములను చెల్లించ లేక చేతులెత్తేశారు. ఈ అంశాలన్నింటిపైనా ప్రత్యేక కార్యాచరణ రూపొందించు కోవాలని, అందరితో చర్చించాలని నిర్ణయించారు.  పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు గన్ని వీరాంజ నేయులు, తోట సీతారామలక్ష్మి, జవహర్‌లతో పాటు ఎమ్మెల్యేలు రామానాయుడు, రామరాజు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌, మంతెన సత్యనారాయణరాజుతో సహా అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లు, అనుబంధ సంస్థల అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ బాధ్యులు సమావేశానికి హాజరవుతున్నారు. సమావేశంలో చర్చించిన తరువాత కీలక నిర్ణయాన్ని వెలువరిస్తారు.

Read more