తగ్గిన పెండింగ్‌ కేసులు

ABN , First Publish Date - 2022-09-12T05:02:19+05:30 IST

జిల్లాలో పెండింగ్‌ కేసుల సంఖ్య తగ్గిందని, పోలీస్‌ స్టేషన్‌కి వచ్చే అర్జీదారుల పట్ల మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని, స్పందనలో అందిన ఫిర్యాదులపై బాధితులకు సత్వర న్యాయం చేకూరేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ యు.రవిప్రకాశ్‌ పోలీస్‌ అధికారులకు సూచించారు.

తగ్గిన పెండింగ్‌ కేసులు
అధికారులతో మాట్లాడుతున్న ఎస్పీ రవిప్రకాష్‌

ఎస్పీ రవిప్రకాశ్‌..భీమవరం సబ్‌ డివిజన్‌ పోలీస్‌ అధికారులతో నేర సమీక్ష
భీమవరం క్రైం, సెప్టెంబరు 11 : జిల్లాలో పెండింగ్‌ కేసుల సంఖ్య తగ్గిందని, పోలీస్‌ స్టేషన్‌కి వచ్చే అర్జీదారుల పట్ల మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని, స్పందనలో అందిన ఫిర్యాదులపై  బాధితులకు సత్వర న్యాయం చేకూరేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ యు.రవిప్రకాశ్‌ పోలీస్‌ అధికారులకు సూచించారు. జిల్లా భీమవరం సబ్‌డివిజన్‌ పోలీస్‌ అధికారులతో  పెదఅమిరంలోని ఎస్పీ క్యాంప్‌ కార్యాలయంలో ఆదివారం నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా  పోలీస్‌ స్టేషన్‌ల వారీగా పెండింగ్‌ అట్రాసిటీ, మహిళలకు సంబంధించిన కేసులు, మిస్సింగ్‌ కేసులపై సమీక్షించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని,  జిల్లాను సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేం దుకు సెబ్‌, పోలీస్‌ అధికారులు సంయుక్తంగా ప్రణాళికను రూపొందించుకోవాలని, సారా ప్రభావిత గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని ఎస్పీ సూచించా రు. పోలీస్‌స్టేషన్‌లలో వివిధ కేసులలో సీజ్‌ చేయబడిన క్రైమ్‌ ప్రాపర్టీ, క్రైమ్‌ వాహనాలు, ఇతర ప్రాపర్టీని చట్టపరమైన ప్రక్రియను పాటించి ఆక్షన్‌ వేయాలన్నారు.  సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ సెబ్‌ ఏటీవీ రవికుమార్‌, సెబ్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలశౌరి, ఏఆర్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీకాంత్‌, ఐటీకోర్‌, డీసీఆర్‌బీ,  భీమవరం సబ్‌ డివిజన్‌ ఎస్‌హెచ్‌వోలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Read more