సంక్రాంతికి 230 స్పెషల్ బస్సులు
ABN , First Publish Date - 2022-12-16T00:02:55+05:30 IST
సంక్రాంతి ప్రయాణి కులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. స్పెషల్ పేరుతో నడిపే బస్సులకు ఈసారి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదు.
నరసాపురం, డిసెంబరు 15 : సంక్రాంతి ప్రయాణి కులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. స్పెషల్ పేరుతో నడిపే బస్సులకు ఈసారి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదు. రెగ్యులర్ బస్సులకు వసూలు చేస్తు న్న ఛార్జీలతోనే స్పెషల్ సర్వీసులు నడపనున్నారు. నరసాపురం నుంచి హైదరాబాద్‌కు నడిచే రెగ్యులర్ సర్వీసుల్లో హైటెక్ బస్సుకు రూ.674, ఇంద్రకు రూ.816 ఛార్జీలు ఉన్నాయి. పండుగ రోజుల్లో నడిపే సర్వీసుల కూ ఇదే ఛార్జీలను వసూలు చేయనున్నారు. హైదరా బాద్ రూట్‌లో గడిచిన మూడేళ్ల డిమాండ్‌ను పరిగణ లోకి తీసుకుని ఈసారి మొత్తం 230 స్పెషల్ బస్సులు నడపనున్నారు. జిల్లాలోని నరసాపురం, భీమవరం, తణుకు, టీపీగూడెం డిపోల నుంచి రోజు హైదరాబాద్ కు 16 రెగ్యులర్ సర్వీసులు నడుస్తున్నాయి. పండుగ ముందు హైదరాబాద్ నుంచి జనవరి 9 నుంచి 14 వరకు డిమాండ్ ఉంటుందని అంచనా వేసి దానికి తగట్టు ఈ ఆరు రోజుల్లో రెగ్యులర్ సర్వీస్‌లతో పాటు మొత్తం 105 సర్వీసులు జిల్లాలోని నాలుగు డిపోలకు నడపనున్నారు. ఇక తిరుగు ప్రయాణంలో 16 నుంచి 21 వరకు డిమాండ్ బట్టి 125 సర్వీసులు నడిపే విధంగా ప్లాన్ చేశారు. జనవరి 16 నుంచి 20 వరకు ప్రతి డిపో నుంచి ఆరు స్పెషల్ బస్సులు నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు రీజనల్ మేనేజర్ వీరయ్య చౌదరి చెప్పారు. ఆన్‌లైన్‌లో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పిస్తున్నామన్నారు.