మొండిగా.. ముందుకే!

ABN , First Publish Date - 2022-09-27T05:40:42+05:30 IST

సచివాలయాల్లో రిజిస్ర్టేషన్లు నిర్వహించేందుకు ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.

మొండిగా.. ముందుకే!

సచివాలయాల్లో రిజిస్ర్టేషన్లు నిర్వహించేందుకు ప్రభుత్వం మొగ్గు
జిల్లాలో 15 గ్రామ సచివాలయాల ఎంపిక
 అక్టోబరు 2వ తేదీ నుంచి ప్రారంభం అమలు పైనే అనుమానం

(భీమవరం–ఆంధ్రజ్యోతి)
సచివాలయాల్లో  రిజిస్ర్టేషన్లు నిర్వహించేందుకు ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. రిజిస్ర్టేషన్‌ ప్రక్రియను వికేంద్రీకరించాలన్న తలంపుతో ఉంది. గతంలో చేపట్టిన పైలట్‌ ప్రాజెక్ట్‌లు విజయవంతమయ్యాయని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాకు ఒక సచివాలయాన్ని అప్పట్లో ఎంపిక చేశారు. దాని పరిధిలోని ఆస్తుల రిజిస్ర్టేషన్లు సంబంధిత సచివాలయాల్లోనే నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ఇలా ఎంపిక చేసిన పలు సచి వాలయాల్లో ఒక్క రిజిస్ర్టేషన్‌ కూడా జరగలేదు. అయినా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. రెండో విడతగా సచివాలయాల సంఖ్యను పెంచింది.
రాష్ట్రవ్యాప్తంగా అక్టోబరు రెండో తేదీ నుంచి సచివాలయాల్లో రిజిస్ర్టేషన్లు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందుకోసం జిల్లాలో 15 గ్రామ సచివాలయాలను ఎంపిక చేసింది.  ప్రస్తుతం సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న రిజిస్ర్టేషన్ల ద్వారా ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం లభిస్తోంది.  రిజిస్ర్టేషన్లకు అనుగుణంగా సిబ్బందిని, సాంకేతిక పరికరాలను అమర్చారు.  స్టాంప్‌లు విక్రయం నుంచి రిజిస్ర్టేషన్‌ డాక్యుమెంట్‌లు ఆన్‌లైన్‌ ప్రక్రియ వరకు సిబ్బందిని నియమించారు. అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది పని చేస్తున్నారు. కానీ సచివాలయాల్లో అటువంటి సేవలు అందించే సిబ్బంది ఎంతవరకు అందుబాటులో ఉంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. సచివాల యాల్లో ఒక్కో విభాగానికి ఒక కార్యదర్శి చొప్పున పది మంది సిబ్బంది సచివాలయాల్లో ఉన్నారు. వారందరినీ సమన్వయం చేసేలా అడ్మిన్‌ ఉంటు న్నారు.  పట్టణాల్లో ఆస్తిపన్ను వసూలు చేసే బాధ్యతలను అడ్మిన్‌లకు అప్పగించారు. పల్లెల్లో  . పంచాయతీలే ఆస్తి పన్ను వసూలు చేస్తు న్నాయి. అయితే గ్రామ సచివాలయ సెక్రటరీలు ఎవరి విధుల్లో వారు ఉంటున్నారు. రెవెన్యూ సెక్రటరీలను తహసీ ల్దార్‌ కార్యాలయాలు ఉప యోగించుకుంటున్నాయి. మహిళా సంరక్షులను పోలీస్‌ శాఖ వినియోగించుకుంటోంది. ఇలా తమకు కేటాయించిన విధు లను  నిర్వహించ డంతో పాటు, జాబ్‌ చార్టర్‌లో లేని బాధ్య తలను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు సచివాలయాల్లో రిజి స్ర్టేషన్లు అంటే  ఒక్కరితో అయ్యే పనికాదు. సచివాలయ అడ్మిన్‌లకు మాత్రమే రిజిస్ర్టేషన్‌ ప్రక్రియపై అవగాహన కల్పించారు. అడ్మిన్‌ సెలవు పడితే ఇంకొకరికి ఆ బాధ్యత నిర్వహించే పరి
జ్ఞానం ఉండదు. సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాల యాల్లో అలా కాదు. కిందిస్థాయి సిబ్బంది నుంచి అవగాహన ఉంటుంది. సాంకేతిక ఇబ్బంతులు తలెత్తితే తప్పా రిజిస్ర్టేషన్లకు అవరోధం ఉండదు. స్టాంప్‌ల విక్రయం, ఈ పోస్‌లో వేలి ముద్రలు నమోదు, రికార్డుల నిర్వహణ, ఆన్‌ లైన్‌లో డాక్యుమెంట్‌ నమోదు వంటి ప్రక్రియ అంతా ఒక్క అడ్మిన్‌ ప్రతిరోజు నిర్వహించడం కష్ట తరం అవుతుంది. ఇతర సెక్రకటరీలు తమ విధుల్లో తలమునకలై ఉంటారు.

లేఖరులే ఆధారం
రిజిస్ర్టేషన్‌ల కోసం భూ యజమానులు దస్తావేజు లేఖరులపైనే ఆధార పడుతున్నారు. వారే అంతా దగ్గ రుండి రిజిస్ర్టేషన్లు నిర్వహించడంలో ప్రజలకు సహ కరిస్తుంటారు. సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల వద్ద లేఖ రులు ఉంటున్నారు. ప్రభుత్వం సచివాయాలకు పూర్తిస్థాయిలో రిజిస్ర్టేషన్‌లు అప్పగిస్తే లేఖరుల పైనే ఆధారపడే జనం పరిస్థితి ఏమిటనే సందేహం తలెత్తుతోంది. మొత్తంగా ప్రభుత్వం రిజిస్ర్టేషన్‌ ప్రక్రియను వికేంద్రీకరించేందుకే మొగ్గుచూపుతోంది. సచివాలయ వ్యవస్థ రాష్ట్రంలోనే ఉంది. ఇక్కడే రిజిస్ర్టేషన్లు వికేంద్రీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

ఆన్‌ లైన్‌ లేనట్టేనా..
ప్రస్తుతం ఆన్‌లైన్‌ విధానంలో రిజిస్ర్టేషన్లు నిర్వహిస్తున్నారు. రాష్ట్రం ఒక యూనిట్‌గా పరిగణిస్తున్నారు. భీమవరం ఉన్న ఆస్తిని శ్రీకాకుళంలో అయినా రిజిస్ర్టేషన్‌ చేసుకోవడానికి సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో అవకాశం ఉంది. సచివాలయాల్లో అటువంటి సౌకర్యం కల్పించడంలేదు. ఎంపిక చేసిన సచివా లయాల పరిధిలో ఉండే ఆస్తుల రిజిస్ర్టేషన్‌ అక్కడే చేయాల్సి ఉంటుంది. సచివాలయాల్లో  రిజిస్ర్టేషన్‌ల వల్ల ఆన్‌లైన్‌ సౌకర్యాన్ని కోల్పోతున్నారు.

జిల్లాలో ఎంపిక చేసిన సచివాలయాలు
మండలం                 గ్రామ సచివాలయం
అత్తిలి        గుమ్మంపాడు
భీమవరం        కె.అన్నవరం
కాళ్ల        వేంపాడు
పెంటపాడు    కస్పా పెంటపాడు
వీరవాసరం    ఉత్తరపాలెం
ఆచంట        కరుగోరుమిల్లి
ఇరగవ రం    కన్నయ్య కుముదువల్లి
మొగల్తూరు    శేరుపాలెం
నరసాపురం    కంసాలి బేతపూడి
పాలకొల్లు        బల్లిపాడు
పెనుగొండ    వెంకటరామపురం
పెనుమంట్ర    వెలగలేరు
పోడూరు        పెమ్మరాజు పోలవరం
తణుకు        ముద్దాపురం
యలమంచిలి    బూరుగుపల్లి

Read more