హర్ ఘర్ తిరంగా ర్యాలీ
ABN , First Publish Date - 2022-08-05T05:15:50+05:30 IST
తాడేపల్లిగూడెం డివిజన్ పోస్టాఫీస్ ఉద్యోగులంతా గురువారం జాతీయ జెండాలతో మోటారు సైకిళ్లపై పట్టణంలో ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ నిర్వహించారు.
తాడేపల్లిగూడెం రూరల్ , ఆగస్టు 4 : తాడేపల్లిగూడెం డివిజన్ పోస్టాఫీస్ ఉద్యోగులంతా గురువారం జాతీయ జెండాలతో మోటారు సైకిళ్లపై పట్టణంలో ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని హెడ్ పోస్టాఫీస్ నుంచి తాలూకా ఆఫీస్, రైల్వేస్టేషన్, పోలీస్ ఐలాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హెడ్ పోస్టాఫీస్ సూపరిం టెండెంట్ సీవీ రామిరెడ్డి మాట్లాడుతూ ప్రతీ ఇంటిపై జెండా ఎగురవేయాలన్న ఉద్దేశంతో రూ.25కే జాతీయ జెండా అందిం చేలా పోస్టాఫీస్ వద్ద కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు. ఈ అవకాశాన్ని అంతా సద్వినియోగించుకోవాలని సూచించారు.