వాతావరణం

ABN , First Publish Date - 2022-11-25T00:03:14+05:30 IST

వాతావరణంలో మార్పులు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

వాతావరణం
యండగండిలో తడిసిన ధాన్యంను ఆరబెడుతున్న రైతు

ఆకాల వర్షంతో రైతులు ఉరుకులు..పరుగులు

ధాన్యం కాపాడుకునేందుకు పాట్లు

పెనుమంట్ర/ ఉండి, నవంబరు 24 : వాతావరణంలో మార్పులు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆరుగాలం పం డించిన పంట చేతికందే దశలో వర్షం బారిన పడుతుందోనన్న ఆందో ళన వారిని పొలం వైపు పరుగులు పెట్టిస్తోంది. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం కారణంగా గురువారం జిల్లాలో పలు ప్రాంతా ల్లో కొద్దిపాటి వర్షం పడింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఉన్నప్పటీ మధ్యాహ్నం నుంచి ఒకసారిగా ఆకాశం మేఘావృతం కావడంతోపాటు వర్షం పడింది. పెనుమంట్ర మండలంలో భారీవర్షం పడింది. అకస్మా త్తుగా కురిసిన వర్షంతో రైతులు ఆందోళన చెందారు. మరి కొద్దిరోజుల్లో వరి కోతలు ముమ్మరం కానున్న క్రమంలో వర్షాలు కలవర పెడుతు న్నాయి. నెలాఖరునాటికి మరో వాయుగుడం ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతుల్లో మరింత గుబులు పెరుగుతోంది. ఉండి మండలంలో కురిసిన వర్షం మాసూళ్లకు అడ్డంకి గా మారింది. పలు ప్రాంతాల్లో రాశులుగా ఉన్న ధాన్యం తడిచి పోయింది. బరకాలు కప్పి ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు.

చంద్రబాబుకు రైతుల గోడు..

పెంటపాడు, నవంబరు 24 :కష్టపడి పండించుకున్న పంటన స్వేచ్ఛగా అమ్ముకునే అవకాశం లేకుండా పోయిందని, రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుల వద్ద రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్‌చార్జి వలవల బాబ్జి సూచనల మేరకు జిల్లా తెలుగురైతు అధ్యక్షుడు పాతూరి రాంప్రసాద్‌ చౌదరి, మరికొంత మంది రైతులు గురువారం అమరావతి తరలివెళ్లి వారిద్దరిని కలసి తమ సమస్యలు చెప్పుకున్నారు. రైతులకు అవసరమైన మేర సంచులు ఇవ్వడం లేదని తెలిపారు. కార్యక్రమంలో పీతల సత్యనారాయణ, పుట్టా రమేష్‌, తన్నీడి షాలోమాన్‌, నెక్కలపూడి రాజు, పుట్టా ప్రసాద్‌, కొక్కిరాల రాంబాబు ఉన్నారు.

Updated Date - 2022-11-25T00:03:51+05:30 IST