కోళ్ల వ్యర్థాలను పట్టేశారు..

ABN , First Publish Date - 2022-01-03T05:34:51+05:30 IST

చేపల చెరువుల్లో కుళ్లిన కోళ్లవ్యర్థాల రవాణా, విని యోగాన్ని నియంత్రించేందుకు మత్స్యశాఖతో పాటుగా ఇతర శాఖల అధి కారు ల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.

కోళ్ల వ్యర్థాలను పట్టేశారు..
అధికారులు స్వాధీనం చేసుకున్న కుళ్లిన కోళ్ల వ్యర్థాలు.

మూడు వాహనాలు స్వాధీనం.. వ్యర్థాలు పూడ్చివేత

పెదపాడు, జనవరి 2: చేపల చెరువుల్లో కుళ్లిన కోళ్లవ్యర్థాల రవాణా, విని యోగాన్ని నియంత్రించేందుకు మత్స్యశాఖతో పాటుగా ఇతర శాఖల అధి కారు ల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కుళ్లిన కోడివ్యర్థాల వినియోగంతో నీటి కాలుష్యంతో పాటుగా ప్రజలకు తలెత్తే ప్రమాదకరస్థాయి రోగా లను వివరిస్తూ ‘రి..పబ్లిక్‌గా విషం’ పేరిట ‘ఆంధ్రజ్యోతి’లో ఇటీ వల కథనం ప్రచురితమైన సంగతి విదితమే. దీనిపై స్పందించి న అధికారులు చేపల చెరువులపై దాడులు నిర్వహిస్తున్నారు.  వీరమ్మకుంట, రావులకుంట, పెదపాడు పార్ట్‌ –2 పరిధిలోని ఫం గస్‌ చేపల చెరువుల్లో కుళ్లిన కోళ్లవ్యర్థాలను మేతగా వేసేందుకు ప్రయత్నిస్తుండగా ఆదివారం తనిఖీలు నిర్వహించి వాహనాలతో పాటుగా కోళ్ల వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నట్టు మత్స్యశాఖ అధికారి గణేశ్వరరావు తెలిపారు. మత్స్యశాఖ, పోలీసు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తుం డగా ఒక బోలెరో, రెండు ఐషర్‌ వాహనాల్లో హైదరాబాద్‌, ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన కుళ్లిన కోడివ్యర్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నా రు. వ్యర్థాలను చెరువు గట్లపై గొయ్యి తీసి పూడ్చిపెట్టి, వాహనాలను పెదపాడు పోలీస్‌ స్టేషన్‌కు తరలించి వాహనాల యజమానులు, డ్రైవర్లు, చెరు వు యజ మానులపై కేసు నమోదు చేశారన్నారు. చేపల చెరువుల్లో కోళ్లవ్యర్థాలను మేతగా వేసే చెరువుల అనుమతిని జిల్లా స్థాయి కమిటీ సిఫార్సులతో రద్దు చేసి, మోటారు వెహికల్‌ అధికారి పర్యవేక్ష ణలో వాహనాల పర్మిట్‌ రద్దు చేసి సీజ్‌ చేస్తామన్నారు. కోళ్ల వ్యర్థాల రవాణా, చెరు వుల్లో మేతగా వినియోగం వంటి సమాచారాన్ని వీఆర్వో, సెక్రటరీ, మత్స్య శాఖ, పోలీసు సిబ్బందికి తెలపాలన్నారు. తనిఖీల్లో వీఆర్వో నరసింహా, హెడ్‌ కాని స్టేబుల్‌ సువర్ణరాజు, కానిస్టేబుల్‌ ప్రదీప్‌  తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-03T05:34:51+05:30 IST