మూగరోదన

ABN , First Publish Date - 2022-12-07T00:43:52+05:30 IST

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పేద రైతులు పాడి పశువులపై ఆధారపడి జీవనోపాధి సాగిస్తుంటారు. ఒక్కొక్క కుటుంబంలో ఒకటి, రెండు పశువులతో కుటుం బాన్ని పోషిస్తుంటారు. దురదృష్టవశాత్తు పాడి పశువు చనిపోతే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది. వీరు నష్టపోకూడదని వైఎస్సార్‌ పశు నష్ట పరిహార పథకం అమల్లోకి తీసుకొచ్చారు. ఈ పథకానికి రైతులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు.

మూగరోదన

(ఆకివీడు)

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పేద రైతులు పాడి పశువులపై ఆధారపడి జీవనోపాధి సాగిస్తుంటారు. ఒక్కొక్క కుటుంబంలో ఒకటి, రెండు పశువులతో కుటుం బాన్ని పోషిస్తుంటారు. దురదృష్టవశాత్తు పాడి పశువు చనిపోతే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది. వీరు నష్టపోకూడదని వైఎస్సార్‌ పశు నష్ట పరిహార పథకం అమల్లోకి తీసుకొచ్చారు. ఈ పథకానికి రైతులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. పశుసంవర్థక శాఖ గుర్తించిన పశువు చెవికి వేసిన ట్యాగ్‌ ఆధారంగా పరిహారం చెల్లిస్తారు. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా మూడున్నరేళ్లలో 1,305 పశువులు, మేకలు, గొర్రెలు మృతి చెందగా 296 మంది యజమాను లకు పరిహారం కింద రూ.85 లక్షల 20 వేలు జమ చేశారు. మిగిలిన 1,009 పశు వులకు రూ.2 కోట్ల 94 లక్షల 30 వేలు చెల్లించాల్సి ఉంది.

తనిఖీల పేరుతో హడావుడి

పాడి పశువు మరణించిన వెంటనే పశు సహాయకుడు నిర్ధారించుకుని వైద్యు డికి సమాచారం ఇస్తారు. క్షేత్రస్థాయిలో మృతి చెందిన పశువుకు శవ పరీక్ష చేసి నివేదికతోపాటు రైతు వివరాలతో సహా య సంచాలకులకు పంపుతారు. అక్కడి ఉప సంచాలకులకు, అక్కడి నుంచి సం యుక్త సంచాలకులు నివేదికను నిర్ధారించుకుని ప్రభుత్వానికి పంపుతారు. ప్రభు త్వం నేరుగా రైతు ఖాతాకు పరిహారం సొమ్మును జమ చేస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన క్లయిమ్‌లను మరోసారి ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేసి, నివేదిక ఇవ్వా లని కోరింది. జిల్లాలో అధికారులు ప్రత్యేక బృందాలుగా తనిఖీలు చేస్తున్నారు. గతంలో అన్ని దశల్లోను తనిఖీలు చేసిన తరువాతే ప్రభుత్వానికి పంపామని, రెండేళ్ల తర్వాత మళ్లీ తనిఖీలంటూ దరఖాస్తుల ను తిరస్కరిస్తే పోషకులకు తాము ఏమ ని సమాధానం చెప్పాలని కిందిస్థాయి సిబ్బంది వాపోతున్నారు.

చెప్పలేదు.. చేయించుకోలేదు

గడిచిన ముఫ్పై ఆరేళ్లుగా 11 గేదెలు, రెండు ఆవులతో పాడి పరిశ్రమ చేస్తున్నాను. ఇన్సూరెన్స్‌ చేయించుకోవాలని వైద్యులు చెప్పలేదు. మేం చేయించుకోలేదు. గత ప్రభుత్వాల హయాంలో గేదెలు చనిపోతే డబ్బులు పడ్డాయి. వైద్యులు చక్కగా చూసేవారు. ఇప్పుడు ఎలాంటి సహకారం లేదు. ప్రతీ పనికి డబ్బులు అంటున్నారు.

– ఇల్లాపు అప్పారావు, పాడి రైతు, వారపుసంత, ఆకివీడు

ఏడాదైనా సొమ్ము పడలేదు

ఈ ప్రభుత్వంలో పాడి రైతులకు మేలు జరిగింది లేదు. 25 ఏళ్ల నుంచి ఆరు గేదె లతోపాటు వ్యవసాయం చేస్తూ జీవనోపాధి సాగిస్తున్నా. గతేడాది గేదె చనిపోయింది. ఇప్పటి వరకూ ఇన్సూరెన్స్‌ సొమ్ము పడలేదు,

– కేశిరెడ్డి కనకయ్య, మాదివాడ, ఆకివీడు

రెండు గేదెలు చనిపోయినా..

కరెంటు షాక్‌ కొట్టి రెండు గేదెలు చనిపోయి ఆరు నెలలైంది. ఇప్పటి వరకూ పైసా పడలేదు. వైద్యులను అడిగితే మీకంటే ముందుగా నష్టపోయిన పాడి రైతులకే పడలేదంటున్నారు. జీవనోపాధి కష్టంగా మారింది. మళ్లీ గేదెలను కొనాలంటే అప్పులు చేసి వడ్డీలు కట్టలేక ఉన్న వాటినే చూసుకుంటున్నా.

– మట్టా లక్ష్మి, పాడి రైతు, ఆకివీడు

త్వరలో నష్టపరిహారం

పాడి రైతులకు పశు నష్టపరిహారం త్వరలో పడతాయని ఆందోళన చెందనవసరం లేదు. నష్టపోయిన పశువుల జాబితా ఉన్నతాధికారులకు నివేదిక పంపించాం. ప్రభుత్వం నిధులు మం జూరు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. నిధులు విడుదల కాగానే బ్యాంకు ఖాతాల్లో పడతాయి. రైతులు ఆధైర్యపడవద్దు.

– పుండరీబాబు, జిల్లా నోడల్‌ అధికారి

ఇవీ నిబంధనలు

ఇన్సూరెన్స్‌ కవర్‌ కావాలంటే.. పాడి ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలకు ప్రభుత్వం గుర్తించిన చెవులకు ట్యాగ్‌లు ఉండాలి.

పునరుత్పాదక దశలో ఉండి రెండేళ్లు నిండి పదేళ్లలోపు వయసున్న ఆవులై ఉండాలి. గేదెలకు మూడు నుంచి 12 ఏళ్లలోపు వయసు కలిగి ఉండాలి.

దేశవాళి మేలు జాతి పశువులకు రూ.30 వేలు, నాటు పశువులకు రూ.15 వేలు నష్టపరిహారం ఇస్తారు.

5 పశువులకు లక్షన్నర రూపాయలు గరిష్టంగా నష్టపరిహారం ఇస్తారు. గొర్రెలు, మేకలు ఆరు నెలలు పైబడిన వయస్సు ఉండాలి.

గుంపులో కనీసం 3 జీవాలు చని పో తేనే నష్టపరిహారం వర్తిస్తుంది.

ఒక్కొక్క జీవానికి రూ.6 వేలు చొప్పున 20 జీవాలకు సంవత్సరానికి గరిష్టంగా రూ.లక్ష 20 వేలు నష్టపరిహారం చెల్లించాలి.

Updated Date - 2022-12-07T00:44:02+05:30 IST