త్వరితగతిన నాడు–నేడు పనులు

ABN , First Publish Date - 2022-09-25T06:20:43+05:30 IST

నాడు నేడు పనుల్లో భాగంగా చేపడుతున్న స్కూల్‌ అభివృద్ధి పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని స్పెషల్‌ చీఫ్‌ కార్యదర్శి రాజశేఖర్‌ ఆదేశించారు.

త్వరితగతిన నాడు–నేడు పనులు
నాడు–నేడు పనులను పరిశీలిస్తున్న స్పెషల్‌ చీఫ్‌ కార్యదర్శి రాజశేఖర్‌, కలెక్టర్‌ ప్రశాంతి

స్పెషల్‌ చీఫ్‌ కార్యదర్శి రాజశేఖర్‌

నరసాపురం/ మొగల్తూరు, సెప్టెంబరు 24: నాడు నేడు పనుల్లో భాగంగా చేపడుతున్న స్కూల్‌ అభివృద్ధి పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని స్పెషల్‌ చీఫ్‌ కార్యదర్శి రాజశేఖర్‌ ఆదేశించారు. నరసాపురం మండలంలో చేపడుతున్న స్కూళ్ల పనులను శనివారం కలెక్టర్‌ ప్రశాంతితో కలిసి ఆయన పరిశీలించారు. గతంలో నిర్మించిన స్కూళ్లను తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగానే పనులు జరగాల న్నారు. తూర్పుతాళ్ళులో విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహా రాన్ని పరిశీలించారు. ఇదే స్కూల్‌లో బోధన తీరును ఆరా తీశారు. ఉపాధ్యాయులు పాఠాలు చెప్పుతున్న తీరు, పుస్తకాలు, యూనిఫాం పూర్తిగా అందాయా.. లేదా అన్న విషయాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. స్టోర్‌ రూమ్‌, రిజిస్టర్‌ను పరిశీలించారు. మొగల్తూరు మండలం ముత్యాలపల్లిలోని బండి ముత్యాలమ్మ ఉన్నత పాఠశాలను కూడా రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్‌ బి.రాజశేఖర్‌ సందర్శించారు. ప్రభుత్వ పాఠశాలకు నాడు–నేడు పథకంలో చేసు ్తన్న పనుల్లో ఎటువంటి అవకతవకలు లేకుండా చేయాలన్నారు. ఆయన వెంట సబ్‌ కలెక్టర్‌ విష్టుచరణ్‌, డీఈవో ఆర్‌.వెంకటరమణ, శ్యాంసుందర్‌ తదితరులు ఉన్నారు.

Read more