భూ దందా!

ABN , First Publish Date - 2022-07-01T06:27:06+05:30 IST

ప్రభుత్వ భూములు మాయమైపోతున్నాయి

భూ దందా!
దర్శిపర్రులో పట్టాదారు పాస్‌ పుస్తకం మంజూరైన రెవెన్యూ హెచ్చరిక బోర్డు ఉన్న ప్రభుత్వ భూమి

నిషేధిత భూముల్లో రిజిస్ర్టేషన్లు
ప్రభుత్వ భూములకు పాస్‌బుక్‌
ఆపై బ్యాంకుల్లో రుణాలు
చోద్యం చూస్తున్న అధికారులు

 (భీమవరం–ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వ భూములు మాయమైపోతున్నాయి. ప్రైవేటు వ్యక్తుల పరమవుతున్నాయి. పట్టాదారు పాస్‌ పుస్తకాలు పుడుతున్నాయి. పెద్దమొత్తంలో బ్యాంకుల్లో రుణాలు పొందుతున్నారు. జిల్లాలో ఇటువంటి అక్ర మాలు కొకొల్లలుగా ఉంటున్నాయి. అక్రమ రిజిస్ర్టేషన్లు జరిగిపోతున్నాయి. అధికారులకు ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోవడం లేదు. లక్షలాది రూపాయలు ముడు పులు తీసుకుంటూ ఫిర్యాదులను తొక్కిపెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
జూ పెంటపాడు మండలం దర్శిపర్రు రెవెన్యూ పరిధిలోని 50,51 సర్వే నెంబర్‌లో ఎకరానికి పైగా భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల్లో అది ఇరిగేషన్‌ భూమిగా నమోదై ఉంది. దానికి పట్టాదారు పాస్‌ పుస్తకం ఇచ్చేశారు. దానికి సమీపంలోనే మరో ఎక రం ప్రభుత్వ భూమికి ప్రైవేటు వ్యక్తులు పట్టాదారు పాస్‌ పుస్తకం సంపాదించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దీనిపై రగడ జరగ్గా మునిసి పాలిటీ స్పందించింది. తాడేపల్లిగూడెం పట్టణానికి శివారున ఉన్న భూమి కావడంతో తమ పరిధిలోకి వస్తుందంటూ మునిసిపల్‌ అధికారులు జెండాలు పాతారు. మరోవైపు రెవెన్యూశాఖ హెచ్చరిక బోర్డులు పెట్టింది. సాగు చేస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. ఆన్‌లైన్‌లో  సదరు సర్వే నెంబర్‌లు ప్రభుత్వ భూమిగానే నమో దై ఉన్నాయి. అయితే పట్టాదారు పాస్‌ పుస్తకం పొందిన రైతులు మాత్రం దర్జా ఒలక బోస్తున్నారు.  

అక్రమ డాక్యుమెంట్లు
ప్రభుత్వ భూములకు అక్రమ డాక్యుమెంట్లు సృష్టిస్తున్నారు. సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో రిజి స్ర్టేషన్లు చేసేస్తున్నారు. సదరు డాక్యుమెంట్‌లతో పాస్‌ బుక్‌లకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. రెవెన్యూ అధికారుల చేతులు తడిపితే  డాక్యుమెంట్‌ల ఆధా రంగా పాస్‌ బుక్‌లు మంజూరైపోతున్నాయి. సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లోనూ అదే తంతు జరుగుతోంది. నిషేధిత భూముల్లోని సర్వే నెంబర్‌లకు రిజిస్ర్టేషన్లు జరిగిపోతున్నాయి. పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలైనా, అక్రమ రిజిస్ర్టేషన్లు అయినా సరే దొరికితేనే దొంగలవుతున్నారు. మొగల్తూరులో ప్రభుత్వ భూములకు రిజిస్ర్టేషన్లు చేశారని సబ్‌ రిజిస్ర్టార్‌ సస్పెండ్‌ అయ్యారు. పాలకొల్లు, ఆచంట, ఆకివీడు, సజ్జాపురం సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల పరిధిలో ప్రభుత్వ భూములు రిజిస్ర్టేషన్‌ జరిగినట్టు అధికారు లకు ఫిర్యాదులు వెళ్లాయి.  సర్వే నెంబర్లు, దస్తావేజు నెంబర్‌లతో సహా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోకపోవడం అనుమానాలకు తావి స్తోంది.  ఆన్‌లైన్‌లో మాత్రం ప్రభుత్వ భూములుగా ఉంటున్నాయి. అవే భూములకు రిజిస్ర్టేషన్లు చేసి డాక్యుమెంట్లు సృష్టిస్తున్నారు. ఆ తర్వాత పాస్‌ బుక్‌లు పొందుతున్నారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకుం టున్నారు.

నిషేధిత భూములు జోలికి పోరాదు
ప్రభుత్వ రికార్డుల్లో నిషేధిత భూములని ఉంటే వాటి జోలికి రిజిస్ర్టేషన్‌ శాఖ అయినా, రెవెన్యూ అధికారులైనా కన్నెత్తి చూడకూడదు. అటువంటి భూములను పరిరక్షించుకోవాలి. జిల్లాలో మాత్రం అందుకు విరుద్ధంగా ఇరి గేషన్‌, దేవదాయ, ప్రభుత్వ పోరంబోకు భూములు అన్యాక్రాంతమైపోతున్నా యి. తప్పుడు డోర్‌ నెంబర్లు, సబ్‌ సర్వే నెంబర్లు వేసేస్తున్నారు. నిషేధిత భూముల్లో ఒక సర్వే నెంబర్‌ ఉంటే దాని సబ్‌ నెంబర్లు వేయడానికి వీలులేదు. ప్రైవేటు వ్యక్తుల పేరుతో రిజిస్ర్టేషన్‌ చేయడం నేరం. కానీ జిల్లాలో రిజిస్ర్టేషన్లు జరిగిపోతున్నాయి. పాస్‌ పుస్తకాలు పుడుతున్నాయి. జిల్లాలో నిషేధిత భూము ల్లో అక్రమ రిజిస్ర్టేషన్లు జరిగినట్టు గతేడాది ఫిబ్రవరిలో రిజిస్ర్టేషన్‌ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సర్వే నెంబర్లు, దస్తావేజు నెంబర్లతో అధికారులకు ఫిర్యాదులు వెళితే కనీసం స్పందించలేదు. కొన్ని సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లోనే కొందరిపైనే వేటు పడింది. ఇతర చోట్ల పట్టించుకున్న పాపాన పోలేదు.  
సర్వేతో  ఒరిగేదెంతా...!
జగనన్న రీ సర్వేలో ప్రభుత్వ భూములన్నీ బయట పడతాయని అధికారులు చెపుతున్నారు. ఆన్‌లైన్‌లో ప్రభుత్వ భూమిగా నమోదై ఉంటే వాటిని ఎవ్వరూ అన్యాక్రాంతం చేసుకోలేరన్న వాదన వినిపిస్తోంది. రీసర్వేలో పూర్తిగా తమ పేరుతో ప్రభుత్వ భూములను మార్చుకోవాలంటూ అక్రమార్కులు చూస్తు న్నారు. చివరకు ఎవరిది పైచేయి అవుతుందో వేచి చూడాలి.

తాడేపల్లిగూడెంలో ఒత్తిడి
తాడేపల్లిగూడెంలోని విమానాశ్రయ భూముల్లో నాలుగు ఎకరాలను రిజిస్ర్టేషన్‌ చేయాలంటూ గతంలో అధికారులపై ఒత్తిడి పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ సమీపంలోనే ఆ నాలుగు ఎకరాలు ఉంది. వాటిని రిజిస్ర్టేషన్‌ చేయాలంటూ ఓ నేత పట్టుబ ట్టారు. ఇటీవల తాడేపల్లి గూడెం సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయానికి ఒక వైపు ఏసీబీ అధికారులు, మరోవైపు విజిలెన్స్‌ అధికారుల తాకిడి ఉంటోంది. దాంతో నేతల ఒత్తిడికి తలొగ్గలేదు. లేదంటే నాలుగు ఎకరాల భూమి అన్యాక్రాంతమయి ఉండేది. వాస్తవానికి తాడేపల్లిగూడెం పట్టణానికి కాస్త దూరంలో ఉన్న విమానాశ్రయ భూములను జగనన్న ఇళ్ల లబ్ధిదారులకు పంచిపెట్టారు. సదరు భూమి జోలికి మాత్రం పోలేదు. దానిపైనే నేతల కన్ను పడినా అధికారులు తప్పుడు పనికి సాహసించ లేకపోయారు. ఇతర ప్రాంతాల్లో మాత్రం గుట్టుచప్పుడు కాకుండా దందాలు సాగుతున్నాయి. ప్రభుత్వ భూములకు రెక్కలొస్తున్నాయి.

Updated Date - 2022-07-01T06:27:06+05:30 IST