గిట్టుబాటు ధరలు కల్పించాలి

ABN , First Publish Date - 2022-11-25T00:05:43+05:30 IST

వరి రైతులకు, ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి జుత్తుగ నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

గిట్టుబాటు ధరలు కల్పించాలి
ఉండిలో తహసీల్దారు కార్యాలయానికి పాదయాత్రగా వెళ్తున్న జనసేన నాయకులు

ఉండి, నవంబరు 24 : వరి రైతులకు, ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి జుత్తుగ నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఉండి ప్రధాన సెంటర్‌ నుంచి గాంధీ విగ్రహం వరకు గురువారం రైతులకు మద్దతుగా పాదయాత్ర చేశారు. గాంధీజీ విగ్రహం వద్ద నిరసన తెలిపి అక్కడ నుంచి తహసీల్దారు కార్యాలయానికి జనసేన ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. నాగరాజు మాట్లాడుతూ రైతుల ప్రభుత్వం అని చెప్పి రైతులను మోసం చేస్తోందని దుయ్యబెట్టారు. ఇటువంటి ప్రభుత్వానికి ప్రజలు, రైతులు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. రైతుల వద్ద నుంచి ధాన్యన్ని సక్రమంగా కొనుగోలు చేసి వారికి మంచి గిట్టుబాటు ధరను ఇచ్చి త్వరితగతింగా నగదు జమ చేయా లని డిమాండ్‌ చేశారు. కల్లబొల్లి మాటలు చెప్పడం కాదు రైతులకు పూర్తిగా సహాయం అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అనంతరం తహసీల్దారు రవీంద్రకుమార్‌కు వినతిపత్రం అందించారు. జిల్లా జనసేన కార్యదర్శి గవర లక్ష్మి, ఉండి, ఆకివీడు, కాళ్ల, పాలకోడేరు మండల జనసేన అధ్యక్షులు యడవల్లి వెంకటేశ్వరరావు, కొటికలపూడి తాతాజీ, ఎరుబండి రామాంజనేయులు, గాధం నానాజీ, నా యులు యర్రా రవికుమార్‌, ప్రసాద్‌, త్రిమూర్తులు, శివకృష్ణ, అడపా గణేష్‌, పెదపాటి ప్రసాద్‌, సత్యనారాయణ తదితరు లు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-25T00:05:43+05:30 IST

Read more