అమృత్‌ సరోవర్‌ చెరువులకు జల హారతి

ABN , First Publish Date - 2022-08-15T05:43:41+05:30 IST

దేశం 75 ఏళ్లల్లో ఎంతో అభివృద్ధి సాధించిందని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు.

అమృత్‌ సరోవర్‌ చెరువులకు జల హారతి
వడ్డిగూడెం చెరువు వద్ద హారతి ఇస్తున్న కలెక్టర్‌ ప్రశాంతి

వీరవాసరం/ తాడేపల్లి గూడెం రూరల్‌, ఆగస్టు 14 : దేశం 75 ఏళ్లల్లో ఎంతో అభివృద్ధి సాధించిందని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. అజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా  అమృత్‌ సరోవర్‌ పథకం కింద ఎంపిక చేసి అభివృద్ధి చేసిన వడ్డిగూడెం చెరువును ఆదివారం ఆమె ప్రారంభిం చారు.  చెరువుకు జలహారతి ఇచ్చి గట్టుపై మొక్కలు నాటారు. గ్రామ పెద్దలను సత్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సైదు శ్రీనివాసరావు, ఎంపీపీ వీరవల్లి దుర్గాభావాని, జడ్పీటీసీ సభ్యుడు గుండా జయప్రకాష్‌ నాయుడు, డ్వామా పీడీ ఎస్టీవీ రాజేశ్వరరావు, తహసీల్దార్‌ ఎం.సుందరరాజు, ఎంపీడీవో ఇన్‌చార్జ్‌   శామ్యూల్‌, తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలం కొత్తూరులో అమృత్‌ సరోవర్‌ పఽథకం కింద అభివృద్ధి పనులు చేపట్టిన పెద్ద చెరువు వద్ద ఆదివారం సర్పంచ్‌ కూడవల్లి హనుమంతు హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. ఎంపీటీసీ ఉప్పు నరసింహమూర్తి, నవాబుపాలెం సర్పంచ్‌ గంగాభవాని,  ధనరాజు పాల్గొన్నారు.

Read more