అధికారులపై ఇంటిపిడుగు

ABN , First Publish Date - 2022-08-05T05:18:05+05:30 IST

జగనన్న ఇళ్ల నిర్మాణం బాధ్యతను అధికారులకు అప్పగిం చింది. ఇళ్లు

అధికారులపై ఇంటిపిడుగు

 ప్రభుత్వ సొమ్ముతో ఇళ్లు నిర్మించాలట!
ఒక్కో ఇంటికి వ్యయం రూ. 2.10 లక్షలు
అందులో బ్యాంకు రుణం రూ. 30వేలు
జిల్లాలో నిర్మాణం ఎలా.. తలలు పట్టుకుంటున్న అధికారులు
 మెట్ట ప్రాంతంలోనే ఆశాజనకం.. అది కూడా నిర్మాణంలో సర్దుబాటుతోనే సాధ్యం
 డెల్టాలో నిర్మాణం సర్దుబాటు కాని వైనం


 (భీమవరం–ఆంధ్రజ్యోతి)
అధికారులపై ప్రభుత్వం మరో అస్త్రం సంధించింది. జగనన్న ఇళ్ల నిర్మాణం బాధ్యతను అధికారులకు అప్పగిం చింది. ఇళ్లు నిర్మించుకోలేని పేదలకు ప్రభుత్వ సొమ్ముతో నిర్మాణం చేసి ఇవ్వాలని దిశానిర్దేశం చేసింది. రాయలసీమ వంటి జిల్లాలో  ప్రజాప్రతినిధులు చొరవ చూపి ఇళ్లు  నిర్మి స్తున్నారు. పశ్చిమలోనూ ప్రభుత్వమే ఇళ్లు నిర్మించేలా కస రత్తు చేశారు. ఆ బాధ్యతను ఇక్కడ అధికారులపై పెట్టా రు. అదే ఇప్పుడు అధికార గణాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
ఇప్పటి వరకు ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులు నిర్మాణాలు ప్రారంభించేలా అధికారులపై ఒత్తిడి తెచ్చారు. శంకుస్థాపనలు చేసేంత వరకు యంత్రాంగాన్ని నిద్రపట్టనివ్వలేదు. రెవెన్యూ శాఖకు కూడా సదరు బాధ్యతలు అప్పగించారు. మునిసిపాలిటీ, రెవెన్యూ, మండల పరిషత్‌ అధికారులంతా లబ్ధిదారులు చుట్టూ ప్రదక్షిణలు చేశారు. వలంటీర్ల నుంచి సచివాలయ కార్యదర్శుల వరకు లబ్ధిదారులపై ఒత్తిడి పెంచారు. ఇళ్ల నిర్మాణం ప్రారంభించకపోతే పట్టాలు తిరిగి తీసుకుంటామంటూ సంకేతాలు పంపారు. అయినా జిల్లాలో వేలమంది లబ్ధిదారులు జగనన్న ఇళ్ల నిర్మాణానికి ముందుకు రాలేదు. జిల్లాలో దాదాపు 71 వేల మందికి పట్టాలు ఇచ్చారు. అందులో సుమారు 51 వేల మంది ఇంటి నిర్మాణా లకు శంకుస్థాపనలు చేశారు. మిగిలిన వారి ఇళ్లను ప్రభుత్వమే నిర్మించి ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. వాస్తవానికి ప్రభుత్వం మూడు కేటగిరీల్లో ఇళ్లు నిర్మించేందుకు ప్రణాళిక చేసింది. మొదటి కేటగిరీలో లబ్ధిదారులు సొంతంగా ఇళ్లు నిర్మించుకోవాలి. వారికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు మంజూరు చేస్తుంది. రెండో కేటగిరీలో రూ.1.80 లక్షలకు సరిపడా ఇనుము, ఇసుక, సిమెంట్‌  సరఫరా చేస్తుంది. లబ్ధిదారులు నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఇక మూడో కేటగిరీలో ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. ఇప్పుడు మూడో కేటగిరీపై పడ్డారు.
 ఎలా సాధ్యం..?
 జిల్లాలో సొంతంగా ఇళ్లు నిర్మించుకున్న వారికి కనిష్టంగా రూ.5 లక్షల వ్యయం అవుతోంది. ప్రభుత్వం రూ.1.80 లక్షలు నగదు లేదా అందుకు సరిపడా సిమెంట్‌, ఇనుము సరఫరా చేస్తోంది. డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలకు అయితే మరో రూ.30 వేలు బ్యాంకులు రుణంగా ఇస్తున్నాయి. కొందరు ప్రైవేటు బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. దాదాపు రూ.3 లక్షలు రుణం తీసుకుంటున్నారు.     ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. గట్టి పునాది, పిల్లర్లు వేసుకుంటున్నారు. దానికోసం ఎలా లేదన్నా రూ.5 లక్షలు వ్యయమవుతోంది. అదే ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1.80 లక్షలతో జిల్లాలో ఎలా ఇళ్లు నిర్మిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ మట్టి స్వభావాన్ని బట్టి పునాదులతో సహా, పిల్లర్స్‌ పటిష్టంగా ఉండాలి. అప్పుడే ఇంటికి మనుగడ ఉంటుంది. ఎత్తయిన ఇళ్ల నిర్మాణం సాధ్యపడుతుంది. నిన్నటి వరకు లబ్ధిదారులు సొంతంగా నిర్మించుకునేలా అధికారులపై లక్ష్యాలను నిరే ్దశించారు. ఇప్పుడు ప్రభుత్వం సొంతంగా నిర్మించే ఇళ్ల బాధ్యతను అధికారులకే అప్పగిస్తు న్నారు. అదే ఇప్పుడు అధికార యంత్రాంగాన్ని కలవరపాటుకు గురి చేస్తోంది.
 ఓ మండలంలో ప్రణాళిక ఇలా..
 తాడేపల్లిగూడెం రూరల్‌ మండలంలో ప్రభుత్వ ఇళ్లకు ప్రణాళిక చేశారు. ఇదే మండలంలో మట్టి కాస్త గట్టితనం ఉంటుంది. దాంతో పిల్లర్లకు స్వస్తి చెప్పారు. బేస్‌మెంట్‌ను తగ్గిస్తున్నారు. శ్లాబ్‌ మందాన్ని తగ్గిస్తూ ప్రణాళిక చేశారు. దీనివల్ల ప్రభుత్వం నిర్ధారించిన మొత్తానికి ఇంటి నిర్మాణం సాధ్యపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం రూ.1.80 లక్షలు ఇస్తుంది. మరో రూ.30 వేలు బ్యాంకులు రుణంగా అందజేస్తాయి. ఆ మొత్తంతో ఇంటి నిర్మాణానికి తాడేపలి ్లగూడెం మండలంలో చర్యలు తీసుకుంటున్నారు.
 ఇదే పద్ధతిలో డెల్టా మండలాల్లో ఇంటి నిర్మాణం సాధ్య పడదు. ఏపీ టిడ్కో నిర్మించిన ఇళ్లకు సంబంధించి అదే జరిగింది. తాడేపల్లిగూడెంలో బేస్‌మెంట్స్‌ వేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అదే బీమవరంలో అయితే 18 అడుగుల మేర పిల్లర్స్‌ వేసి టిడ్కో ఇళ్లు నిర్మించారు. మట్టి స్వభావాన్ని బట్టి నిర్మాణాల్లో తేడా ఉంటుంది. డెల్టాలో మట్టి కాస్త వదులుగా ఉంటుంది. ముంపు భయం ఉంటుంది. ఇళ్లు కాస్త ఎత్తుగా నిర్మించుకోవాల్సి ఉంటుంది. పిల్లర్స్‌ వేయాలి. అలా నిర్మాణం చేపట్టాలంటే ప్రభుత్వం సమకూర్చే సొమ్ములతో సాధ్యమయ్యే పని కాదు. కాంట్రాక్టర్లు కూడా ముందుకు రారు. ఇతర రాయలసీమ ప్రాంతంలో  ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకున్నారు. పశ్చిమలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. అధికారులే సర్వశక్తులొడ్డుతున్నారు. లబ్ధిదారులపై ఒత్తిడి పెంచుతున్నారు. ప్రభుత్వం నిర్మించే ఇళ్లకు సంబంధించి ఇప్పుడు వారే ఒత్తిడికిలోనవుతున్నారు. ఉన్నతాధికారుల నుంచి దీనిపై ఆదేశాలొస్తున్నాయి. నిర్మాణాలు చేపట్టాలంటూ దిశానిర్దేశం చేస్తున్నారు. మొత్తంపైన జగనన్న ఇళ్లు ఆది నుంచి అధికారుల మెడపై కత్తిలా వేలాడుతూనే ఉన్నాయి.

Updated Date - 2022-08-05T05:18:05+05:30 IST