గ్రామాల్లో హరిదాసుల సందడి
ABN , First Publish Date - 2022-01-07T05:49:21+05:30 IST
గ్రామాలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. రంగురంగుల ముగ్గులతో వీధులు కళకళలాడుతుండగా హరిదాసులు వీధుల్లో తిరుగుతూ హరిలో రంగ హరి అంటూ.. హరి నామ సంకీర్తనలు చేస్తూ పండుగ సందడి తెస్తున్నారు.
పెదవేగి, జనవరి 6 : గ్రామాలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. రంగురంగుల ముగ్గులతో వీధులు కళకళలాడుతుండగా హరిదాసులు వీధుల్లో తిరుగుతూ హరిలో రంగ హరి అంటూ.. హరి నామ సంకీర్తనలు చేస్తూ పండుగ సందడి తెస్తున్నారు. మండలంలోని రామశింగవరానికి చెందిన జమ్మి రాములదాసు సంక్రాంతి పండుగ నెలరోజులు గ్రామాల్లో హరినామ స్మర ణ చేస్తూ వంశపారంపర్యంగా వచ్చిన కళను బతికిస్తున్నాడు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఉపవాస దీక్షతో రోజుకు ఐదు గ్రామాల్లో హరినామస్మరణ చేస్తూ తిరుగుతుంటానని తెలిపాడు. హరినామస్మరణలో ఉండడంతో ఆకలి దప్పికలు ఉండవని భక్తిపారవశ్యంతో తెలిపాడు.