పోరాటాల్లో కార్యకర్తలు కియాశీలక పాత్ర పోషించాలి

ABN , First Publish Date - 2022-08-04T05:49:32+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై, దళితులు, గిరిజనులు, మైనార్టీ, మేధావులపై మతోన్మాదులు సాగిస్తున్న దాడులకు వ్యతిరేకంగా జరిపే పోరాటాల్లో కార్యకర్తలు క్రియాశీలక పాత్ర పోషించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి.ఓబులేసు పిలుపునిచ్చారు.

పోరాటాల్లో కార్యకర్తలు కియాశీలక పాత్ర పోషించాలి
ప్రతినిధుల సభలో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఓబులేసు

  సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు  ఓబులేసు
భీమవరం అర్బన్‌, ఆగస్టు 3: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై, దళితులు, గిరిజనులు, మైనార్టీ, మేధావులపై మతోన్మాదులు సాగిస్తున్న దాడులకు వ్యతిరేకంగా జరిపే పోరాటాల్లో కార్యకర్తలు క్రియాశీలక పాత్ర పోషించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి.ఓబులేసు పిలుపునిచ్చారు. సీపీఐ 26వ జిల్లా మహాసభల సందర్భంగా  రెండోరోజు బుధ వారం జరిగిన ప్రతినిధుల సభకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లా డుతూ వాజపేయితో సహా ప్రధానులందరూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మిస్తే వాటిని నిస్సిగ్గుగా మోదీ అమ్మోస్తున్నాడన్నారు. రాష్ట్రంలో జగన్‌ విపక్షాలే ఉండ కూడదన్న ప్యూడల్‌ సంస్కృతి నుంచి బయటకు రావాలన్నారు. విశాఖలో జరిగే రాష్ట్ర మహాసభల్లో, విజయవాడలో జరిగే జాతీయ మహాసభల్లో నూతన ప్రత్యామ్నాయంపై దిశా నిర్దేశం చేస్తామన్నారు. సీపీఐ రాష్ట్ర కంట్రోల్‌ కమీషన్‌ చైర్మన్‌ నెక్కంటి సుబ్బారావు మాట్లాడుతూ జిల్లాలో బలమైన ఉద్యమాలను నిర్వహించిన ఘనత తమదేనన్నారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు సమర్పించిన నివేదికను సభ అమోదించింది. సీపీఐ జాతీయ మహాసభలకు జిల్లా సమితి తరపున భీమారావు 25,000 విరాళాన్ని అందజేశారు. సమావేశంలో నాయకులు చెల్లబోయిన రంగారావు, టి.అప్పాలస్వామి, ఎం.వసంత కుమారి, పెన్మెత్స సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-04T05:49:32+05:30 IST