కేంద్రం దృష్టికి ఆక్వా సమస్యలు

ABN , First Publish Date - 2022-11-30T00:31:22+05:30 IST

ఆక్వా రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని కేంద్ర విదేశీ వ్యవహారాల, పార్లమెంట్‌ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి మురళీధరన్‌ చెప్పారు.

కేంద్రం దృష్టికి ఆక్వా సమస్యలు
సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి మురళీధరన్‌

భీమవరం, నవంబరు 29 : ఆక్వా రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని కేంద్ర విదేశీ వ్యవహారాల, పార్లమెంట్‌ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి మురళీధరన్‌ చెప్పారు. భీమవరంలో ప్రవాస యోజన కార్యక్రమంలో భాగం గా మంగళవారం ఒక రోజు పర్యటనకు ఆయన వచ్చారు. జిల్లా లో అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యలు, ఆక్వా, వరి రైతుల సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించారు. రొయ్యల ధరలు స్థిరంగా ఉండకపోవడం వల్ల నష్టపోతున్నామని, పెరిగిన ఫీడ్‌ ధరలు తగ్గించాలని, నాణ్యమైన రొయ్య పిల్లలను సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆక్వా రైతులు కోరారు. బీజేపీ కిసాన్‌ మోర్చా కార్యదర్శి అల్లూరి సాయిదుర్గరాజు, బీజేపీ జిల్లా కార్యదర్శి సుభాష్‌రాజు ఆక్వా వరి రైతులు సమస్యలు వివరించారు. ఈ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళతానని మంత్రి చెప్పారు. ప్రవాస్‌ యోజన కన్వీనర్‌ పాకా వెంకట సత్యనారాయణ, సుధాకర్‌ యాదవ్‌, పలువురు అధికారులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

––––––––––––––––

Updated Date - 2022-11-30T00:31:33+05:30 IST