ఆక్వాకు తుఫాన్‌ గండం

ABN , First Publish Date - 2022-12-06T00:26:30+05:30 IST

ఆక్వాకు తుఫాన్‌ గండం పొంచి ఉంది. వాయుగుండం రానుందన్న వాతావరణశాఖ హెచ్చరికతో ఆయా రైతుల్లో భయాం దోళన నెలకొంది. రెండురోజులుగా వాతావరణం చల్లబడి చిరుజల్లులు పడ టంతో చెరువుల్లో నీరు చల్లబడి ఆక్సిజన్‌ కొరత ఏర్ప డింది. దీంతో రొయ్యలు మృతువాత పడే ప్రమాదం ఉందని వారంతా దిగాలు చెందు తున్నారు.

ఆక్వాకు తుఫాన్‌ గండం
రొయ్యల చెరువుల్లో నిరంతరాయంగా తిప్పుతున్న ఏరియేటర్లు

కలిదిండి, డిసెంబరు 5: ఆక్వాకు తుఫాన్‌ గండం పొంచి ఉంది. వాయుగుండం రానుందన్న వాతావరణశాఖ హెచ్చరికతో ఆయా రైతుల్లో భయాం దోళన నెలకొంది. రెండురోజులుగా వాతావరణం చల్లబడి చిరుజల్లులు పడ టంతో చెరువుల్లో నీరు చల్లబడి ఆక్సిజన్‌ కొరత ఏర్ప డింది. దీంతో రొయ్యలు మృతువాత పడే ప్రమాదం ఉందని వారంతా దిగాలు చెందు తున్నారు. రెండు సంవత్సరాలుగా డిసెంబర్‌లో సంభవించే తుఫాన్లతో ఆక్వా రైతులు తీవ్ర నష్టాల బాట పట్టి అప్పుల పాలవుతున్నారు. ఎన్నో ఒడిదొడు కులు ఎదుర్కొంటున్నారు. మండలంలో దాదాపు 25 వేల ఎకరాల్లో రొయ్యల సాగు అవుతోంది. రొయ్యలు పట్టుబడికి వచ్చే సమయానికి తుఫాన్లు సంభ వించి ఆక్వా రైతులను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. భారీ వర్షాల నుంచి కోలు కొంటున్న తరుణంలో తుఫాన్‌ పొంచి ఉండ టంతో చెరువుల్లో ఏరియేటర్లు నిరంతరా యంగా తిప్పుతున్నారు. విద్యుత్‌ కోత విధిస్తే ప్రత్యామ్నాయంగా జనరేటర్లు ఏర్పాటు చేసు కుంటున్నారు. చెరువుల గట్లను పటిష్టం చేసుకుంటున్నారు. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టడంతో ప్రతికూల వాతావరణం నుంచి బయటపడాలని రేయింబవళ్లు చెరు వుల వద్దే కాపలా ఉంటున్నారు. ఇప్పటికే ఎకరానికి సుమారు రూ.1.5 లక్షలు పెట్టుబడి పెట్టారు. మేత ధరలు, లీజు పెరగటంతో పాటు రొయ్యలకు గిట్టుబాటు ధర లేకపోవ టంతో ఆక్వా రైతులు కొట్టుమి ట్టాడుతున్నారు. ఇలాంటి తరుణంలో తుఫాన్‌ సంభవిస్తుందని వాతావరణ హెచ్చరికలతో ఆక్వా రైతుల గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయి. తుఫాన్‌ ముప్పు నుంచి బయట పడటానికి ఆక్వా రైతులు అప్రమత్తంగా ఉండాలని మేత శాఖాభివృద్ధి అధికారులు సూచనలు చేస్తున్నారు.

Updated Date - 2022-12-06T00:27:41+05:30 IST