-
-
Home » Andhra Pradesh » West Godavari » vro division committee elected-NGTS-AndhraPradesh
-
వీఆర్వోల సమస్యల పరిష్కారానికి కృషి
ABN , First Publish Date - 2022-09-26T06:30:50+05:30 IST
వీఆర్వోల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సంఘ రాష్ట్ర అధ ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు అన్నారు.

పాలకొల్లు టౌన్, సెప్టెంబరు 25: వీఆర్వోల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సంఘ రాష్ట్ర అధ ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు అన్నారు. ఆదివారం పశ్చిమగోదావరి పాలకొల్లు తహసీల్దార్ కార్యాలయంలో జరి గిన డివిజన్ స్థాయి వీఆర్వోల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకు న్నారు. అధ్యక్షుడిగా నరసాపురం మండల వీఆర్వో కెవి సత్యనారాయణ, కార్యదర్శిగా పెనుమంట్ర మండల వీఆర్వో దొంగ శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా పాలకొల్లు మండల వీఆర్వో వి.సునీల్‌కుమార్, సీతారాం, వెళ్లి సుభద్ర, కోశాధికారిగా గెడ్డం చిన సత్యనారాయణ, మరో ఏడుగురు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా ఉమ్మడి జిల్లాల వీఆర్వోల సంఘ ప్రధాన కార్యదర్శి రాంబాబు, సహాయ అధికారిగా ఏలూరు డివిజన్ వీఆర్వోల సంఘ అధ్యక్షులు వెంకటేశ్వరరావు వ్యవహరించారు. రవీంద్రరాజు మా ట్లాడుతూ గ్రేడ్–2 వీఆర్వోలకు రెండేళ్ల సర్వీస్ పూర్తయినందున షరతులతో సంబంధం లేకుండా ప్రొబేషన్ డిక్లేర్ చేసి పేస్కేల్ ఇప్పించాలన్నారు. ప్రస్తుతం వీఆర్వో ల తీవ్ర పని ఒత్తిడితో ఇబ్బందులకు గురవుతున్నారని, వీఆర్వోల సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తామన్నారు. సంఘ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మిరియాల నారాయణ, వాసిరెడ్డి ఏసుబాబు, ఎం. రమేష్, బళ్ళరాజు, నరసాపురం డివిజన్లోని 10 మండలాల వీఆర్వోలు పాల్గొన్నారు.
భీమవరం డివిజన్ కమిటీ ఎన్నిక
భీమవరం: భీమవరం డివిజన్లో ఉన్న 9 మండలాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొని ఎన్నికలు ఏకగ్రీవం చేసుకుని డివిజన్ అధ్యక్షుడిగా కాళ్ళ మండలం వీర్వో కెనడీని, డివిజన్ సెక్రటరీగా తాడేపల్లిగూడెం మండలం వీఆర్వో మంగరాజుని, ఉపాధ్యక్షులుగా టి.దానయ్య, ఎన్ కోటేశ్వరరావు, వై.రాజ్యముని, కోశాధికారిగా జి.పెంట య్య, కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికలకు ఎన్నికల అధికారిగా ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి రాంబాబు, అసిస్టెంట్ ఎన్నికల అధికారిగా ఏలూరు డివిజన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు వ్యవహరించారు. నర్సాపురం డివిజన్ అధ్యక్షుడు సత్తిబాబు ఏసు, భీమవరం మండల అధ్యక్షుడు రతన్‌రాజు, జకరయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం డివిజన్ల్లో ఉన్న 9మండలాల నుండి గ్రామ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.