వీఆర్‌ఏల నిరసన

ABN , First Publish Date - 2022-03-05T05:51:07+05:30 IST

వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని కోరు తూ ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరాయి.

వీఆర్‌ఏల నిరసన
మోకాళ్లపై నిలిచి నినాదాలు చేస్తున్న వీఆర్‌ఏలు

ఏలూరు కలెక్టరేట్‌, మార్చి 4 : వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని కోరు తూ ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరాయి. జిల్లా నలు మూలల నుంచి వీఆర్‌ఏలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కనీస వేతనం రూ. 21 వేలు ఇవ్వాలని, అర్హులైన వీఆర్‌ఏలకు పదోన్నతులు ఇవ్వాలని, నామినీ వీ ఆర్‌ఏలను రెగ్యులర్‌ వీఆర్‌ఏలుగా గుర్తించాలని నినాదాలు చేశారు. మోకాళ్లపై నిల్చుని నిరసన తెలిపారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్‌.లింగరాజు, శ్రామిక మహిళా నాయకులు శ్యామలారాణి, విజయలక్ష్మి మాట్లాడుతూ వీఆర్‌ఏల సమస్యలు ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. వీఆర్‌ఏల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.వి.సుబ్బారావు, అధ్యక్షుడు గణేశ్వ రరావు, వర్కింగ్‌ అధ్యక్షుడు ఆంజనేయులు మాట్లాడుతూ ఇరవై రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని ఆరోపించారు. బి.పండు, రవికుమార్‌, నాని, వెంకట్రావు, సురేష్‌ దీక్షలో పాల్గొనగా, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సోమయ్య, డి.ఎన్‌.వి.డి.ప్రసాద్‌, జిల్లా నాయకులు ముత్యాలరావు, రాంబాబు తదితరులు నాయకత్వం వహించారు.

Updated Date - 2022-03-05T05:51:07+05:30 IST