వివేకానందుడి ఆశయాలు స్ఫూర్తి

ABN , First Publish Date - 2022-01-13T05:45:42+05:30 IST

స్వామి వివేకానందుడి ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఏపీ నిట్‌ డీన్‌ డాక్టర్‌ జయ రామ్‌ అన్నారు.

వివేకానందుడి ఆశయాలు స్ఫూర్తి
తాడేపల్లిగూడెం నిట్‌లో వివేకానందుడి జయంతి వేడుక

తాడేపల్లిగూడెం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): స్వామి వివేకానందుడి ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఏపీ నిట్‌ డీన్‌ డాక్టర్‌ జయ రామ్‌ అన్నారు. నిట్‌లో బుధవారం వివేకానంద జయంతి ఉత్సవాలను నిర్వ హించారు. దేశం గర్వించదగ్గ మహనీయుడు వివేకానంద అని డాక్టర్‌ జయరామ్‌ అన్నారు. సాస్‌ విభాగం ఇన్‌ఛార్జి డాక్టర్‌ కిరణ్‌ తీపర్తి, స్టూడెంట్స్‌ అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ జి.సంతోష్‌ కుమార్‌, ఈఈఈ, ఏఎంఈ విభాగాధి పతులు డాక్టర్‌ వి.సందీప్‌, డాక్టర్‌ సునీల్‌ పాల్గొన్నారు.

తణుకు: సీనియర్‌ సిటిజన్స్‌ కార్యాలయంలో వివేకానంద జయంతి కార్య క్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా డాక్టర్‌ తాతిన రామబ్రహ్మం హాజర య్యారు. అనంతరం సభ్యులు పరిమి సూర్యనారాయణ, ఎస్‌.చలపతిరావు రూ.5 వేలు చొప్పున సంఘ అభివృద్ధికి విరాళంగా అందించారు. అధ్యక్షుడు అల్లూరి కరుణాకర చౌదరి, సత్యనారాయణ, రామకృష్ణారావు పాల్గొన్నారు.

గణపవరం: బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక చింతలపాటి మూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వామి వివేకానంద విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నంద్యాల రామలింగరాజు, కూనిరెడ్డి సోమేశ్వరరావు, ఇంటి ఉదయభాస్కర్‌, కొయ్యల వెంకటసుబ్బారావు పాల్గొన్నారు. చింతలపాటి మూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళా శాలలో విద్యార్థులకు వ్యాసరచన, వకృత్వ పోటీలు నిర్వహించి బహుమతు లను కళాశాల ప్రిన్సిపాల్‌ వైవీ అప్పారావు అందజేశారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ మధురాజు, అధ్యాపకులు అక్కిరాజు, గౌతమ్‌కుమార్‌, జ్యోతి పాల్గొన్నారు.

 నిడదవోలు: పట్టణంలోని రామకృష్ణ సేవాసమితి వద్ద వివేకానంద విగ్రహానికి సీఐ వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ పి.నాగరాజు పూలమాల వేసి నివాళు లు అర్పించారు. కార్యక్రమానికి వేదుల జనార్దనరావు అధ్యక్షత వహించారు

ఇరగవరం: తూర్పువిప్పర్రు సర్పంచ్‌ తమ్మిశెట్టి సత్యనారాయణ ఆధ్వర్య ంలో స్వామి వివేకానంద జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానంద విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్య క్రమంలో జనసేన పార్టీ ఇన్‌చార్జి విడివాడ రామచంద్రరావు, పార్టీ మండల ప్రెసిడెంట్‌ ఆకేటి కాశీ, తణుకు టౌన్‌ ప్రెసిడెంట్‌ కొమ్మిరెడ్డి శ్రీనివాసు, అఖిల భారత చిరంజీవి ఫ్యాన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కటకం రామకృష్ణ పాల్గొన్నారు.

తాడేపల్లిగూడెం రూరల్‌: పట్టణంలోని 7వ వార్డు వివేకానంద జంక్షన్‌ వద్ద బుధవారం బీజేపీ యువమోర్చ నాయకులు వివేకానందుడి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు, ఎస్సీ మోర్చ జిల్లా ఉపాధ్యక్షుడు పెదపోలు వెంకటే శ్వర్లు, యువమోర్చ నాయకులు యడ్లపల్లి శ్రీరామ్‌ పాల్గొన్నారు. 

అత్తిలి: బల్లిపాడు మదన గోపాలస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివేకానంద చిత్రప టానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బల్లిపాడు మదన గోపాల స్వామి దేవస్థాన ఛైర్మన్‌ ధనుమూరి తాతాజి, ఆలయ కార్యనిర్వహణాధికారి చాందక దారబాబు తదితరులు పాల్గొన్నారు. 

నిడమర్రు: ఫత్తేపురంలో శ్రీరామ క్షత్రియ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు సాగిరాజు జానకిరామరాజు, అధ్యక్షుడు నంబూరి యుగంధర్‌, రుద్దరాజు బంగ్రారాజు, మంత్రబుడ్డి అప్పారావు, పత్సమట్ల ధర్మరాజు, ఉద్దర్రాజు రాయపరాజు, నడింపల్లి వెంకట్రాజు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-13T05:45:42+05:30 IST