పశు విజ్ఞాన్‌ బడితో రైతులకు ఉపయోగం

ABN , First Publish Date - 2022-08-05T05:00:44+05:30 IST

పశు విజ్ఞాన్‌బడి ద్వారా పాడి రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ఉపయోగాలు తెలియజేయాలని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికా రి కె.మురళీకృష్ణ అన్నారు.

పశు విజ్ఞాన్‌ బడితో రైతులకు ఉపయోగం
సమావేశంలో మాట్లాడుతున్న మురళీకృష్ణ

పాలకొల్లు టౌన్‌, ఆగస్ట్‌ 4: పశు విజ్ఞాన్‌బడి ద్వారా పాడి రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ఉపయోగాలు తెలియజేయాలని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికా రి కె.మురళీకృష్ణ అన్నారు. స్థానిక పశుసంవర్ధక శాఖ కార్యాలయ ఆవరణలో డీడీ జవహర్‌ హుస్సేన్‌ ఆధ ్వర్యంలో గురువారం  సమీక్షా సమావేశ ం నిర్వహించారు. సిబ్బంది, సహాయకుల పనితీరుపై సమీక్షించారు. రైతులకు అందించాల్సిన సంక్షేమ పథకాలు, సేవలను వివరించారు. పాలకొల్లు ఏడీ డాక్టర్‌ ఎం.రామశేఖర్‌, దగ్గులూరు, యలమంచిలి, దొడ్డిపట్ల పశువైద్యులు డాక్టర్‌ పి.వరప్రసాద్‌, డాక్టర్‌ డి.మాధురి, డాక్టర్‌ పి.చంద్రశేఖరరెడ్డి, సిబ్బంది, సహాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-05T05:00:44+05:30 IST