Tdp Leaders: వరద బాధితులకు కూరగాయల పంపిణీ

ABN , First Publish Date - 2022-08-05T01:08:59+05:30 IST

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు నర్సరావుపేట నర్సరావుపేటకు చెందిన డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు.. ...

Tdp Leaders: వరద బాధితులకు కూరగాయల పంపిణీ

జంగారెడ్డిగూడెం ( ఏలూరు జిల్లా): టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు నర్సరావుపేటకు చెందిన డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు.. వదర బాధితులకు బాసటగా నిలిచారు. వరదల్లో నిరాశ్రయులైన వారికి కూరగాయలు పంపిణీ చేశారు. 


వేలేరుపాడు మండలానికి చెందిన నార్లవరం - 73, నార్లవరం కాలనీ -83, తూర్పుమెట్ట - 75, పడమట మెట్ట - 118, కొత్తూరు - 130 కుటుంబాలకు నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు చేతుల మీదుగా కూరగాయలు అందజేశారు.


 ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అమరవరపు అశోక్, ప్రధాన కార్యదర్శి కట్టం రాంబాబు, నూపా శ్రీరాములు, పూనెం రామారావు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారుు. 


Updated Date - 2022-08-05T01:08:59+05:30 IST