శ్రావణ సందడి
ABN , First Publish Date - 2022-08-05T05:25:12+05:30 IST
వరలక్ష్మి వ్రతం పురస్క రించుకుని మారెట్లు సందడిగా మారాయి. శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం కారణంగా మార్కెట్లు కిట కిటలాడాయి.
మార్కెట్లన్నీ కిట..కిట
కొండెక్కిన పూజా సామగ్రి ధరలు
ఏలూరుసిటీ/భీమవరం టౌన్, ఆగస్టు 4 : వరలక్ష్మి వ్రతం పురస్క రించుకుని మారెట్లు సందడిగా మారాయి. శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం కారణంగా మార్కెట్లు కిట కిటలాడాయి. గురువారం మధ్యాహ్నం నుంచి మహిళలు పూజా సామాగ్రి కొనుగోలు చేసేందుకు మార్కెట్‌కు రావడంతో రద్దీగా మారాయి. మరోపక్క అమ్మవార్ల ఆలయాలను ముస్తాబు చేస్తున్నారు. భీమవరం మావుళ్ళమ్మ, దువ్వ దానేశ్వరి, పెనుగొండ వాసవీ కన్యకా పరమేశ్వరి, ద్వారకా తిరుమల కుంకు ళ్లమ్మ ఆలయంతో పాటు ఉమ్మడి జిల్లాల్లోని వివిధ ప్రసిద్ధ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
ధరలు పెంచేశారు..
ప్రతీ ఏటా వరలక్ష్మీ వ్రతం ముందు రోజున మార్కె ట్లో డిమాండ్‌ను బట్టి పూలు, పండ్లు ధరలను విపరీతంగా పెంచేస్తారు. ఈసారి కూడా అదేవిధంగా చామంతి, బంతి, గులాబి, మల్లెలు, జాజి, కనకాంబరం పూల ధరలు చుక్కలు చూపించాయి. యాపిల్, దానిమ్మ, అరటి, ద్రాక్ష, బత్తాయి పండ్లను అమ్మ వారికి నైవేద్యంగా పెడతారు. వీటి ధరలు కూడా కొండెక్కి కూర్చున్నాయి గతేడాది కరోనా కారణంగా నామ మాత్రంగా నిర్వహించినా ఈసారి ప్రతి ఇంటా చేసేం దుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కనకాంబరం పూలు మూర రూ. 200, మల్లెలు మూర రూ. 120 వరకు విక్రయించారు. అరటి పండ్లు డజను రూ.50 నుంచి 70 వరకు అమ్మారు. రూ.20 ఇస్తే 10 నుంచి 15 తమలపాకులు ఇస్తున్నారు. ఆపిల్ ఒక్కోటి 15 నుంచి 20, బత్తాయి 10 నుంచి 15, కొబ్బరికాయ 20, కలువ పూవు రూ.6, అమ్మవారి ప్రతిమ రూ.100 నుంచి 200, చామంతి 100 గ్రాములు రూ. 60, చిన్న గులాబీలు రూ.60 , బంతిపూల దండలు చిన్నవి రూ.70, పెద్దవి రూ.120 అమ్ముతున్నారు. గోదావరి వరదల కారణంగా లంకగ్రామాల్లో ఉండే పూలు, పండ్లు తోటలు ముంపునకు గురవడం కారణణగా ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.
మార్కెట్లు బిజీ..బిజీ
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మార్కెట్లు బిజీబిజీగా కని పించాయి. ఏలూరు నగరంతో పాటు భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నూజివీడు, కైకలూరు తది తర పట్టణాల్లో మార్కెట్లు కిటకిటలాడాయి. ఎక్కడ చూసినా పండుగ సందడి కనిపించింది. బట్టల దుకా ణాలు, ఫ్యాన్సీ దుకాణాలు కళకళలాడాయి. బంగారం షాపుల్లో కొనుగోళ్లు పెరిగాయి. ఎక్కడ ఏ మార్కెట్ చూసినా శ్రావణ శోభతో కళకళలాడాయి.
బంగారు దుకాణాలు కళకళ..
నరసాపురం, ఆగస్టు 4: జ్యూయలరీ షాపులు గురువారం కిటకిటలాడాయి. అన్ని షాపుల వద్ద మహిళల సందడి కనిపించింది. శ్రావణ శుక్రవారం పూజలకు అవసరమైన బంగారు ప్రతిమ, అభరణాలను కొనేందుకు మహిళలు క్యూ కట్టారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేవరకు అన్ని షాపుల వద్ద ఇదే సీన్ కనిపించింది. ధర ఎక్కవైన ప్పటికీ లెక్క చేయలేదు. గురువారం గ్రాము బిస్కెట్ బంగారం రూ.5370, అర్నమెంట్ రూ.4925 పలికింది. ఎక్కువ మంది అర్నమెంట్ బంగారంతో తయారు చేసిన ప్రతిమను కొనేందుకు మక్కువ చూపారు. సెంటిమెంట్‌గా చాల మంది ఆభరణాలను కొనుగోలు చేశారు. ఉమ్మడి జిల్లాలో గురువారం ఒక్క రోజే సుమారు రూ.8 కోట్లుపైనే వ్యాపారం జరిగి ఉండవచ్చని అంచనా. పెళ్ళిళ్ళ సీజన్ కూడా తాకడంతో వ్యాపారం ఎక్కువగా సాగినట్లు బులియన్ వర్తకులు పేర్కొంటున్నారు. అత్యధికంగా నరసాపురం మార్కెట్లోనే కొనుగోళ్లు సాగాయి. జిల్లా నుంచే కాకుండా సరిహద్దు జిల్లాలైన తూర్పు, కృష్ణా , ఏలూరు జిల్లాల నుంచి ఎక్కువ మంది ఇక్కడ బంగారం కొనేందుకు వచ్చారు.
నేడు వరలక్ష్మీ వ్రతం
శ్రావణమాసం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం ప్రతి ఇంటా ఆచరించడం సంప్రదాయంగా వస్తోంది. వేకువజామునే మహిళలు ఇంటిని రంగవల్లులతో అలంకరించి అమ్మవారిని మనసారా ఆహ్వానిస్తారు. వరలక్ష్మీదేవిని కలశ రూపంలో ప్రతిమను ప్రత్యేకంగా అలంకరించి అమ్మవారికి ప్రీతికరమైన చేమంతులు, కలువపూలతో ప్రత్యేకంగా పూజలు చేస్తారు వివిధ రకాల పండ్లు, తొమ్మిది రకాల పిండి వంటలతో అమ్మవారికి నివేదన చేస్తారు. కొత్తగా పెళ్లయిన నవ వధువులు ఈ రోజున వ్రతం చేసుకుని పేరంటాళ్లకు వాయనం అందిస్తారు.శ్రావణమాసంలో రెండవ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే అష్ట లక్ష్ములకు అర్చన చేసినంత ఫలం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు.
