-
-
Home » Andhra Pradesh » West Godavari » urban health centre staff rally at west godavari dist-NGTS-AndhraPradesh
-
అంటువ్యాధులపై అవగాహన ర్యాలీ
ABN , First Publish Date - 2022-03-05T05:56:28+05:30 IST
దోమల నుంచి వ్యాపించే డెంగీ, మలేరియా జ్వరాలను అరికట్టేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మునిసి పల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాలనాయక్ సూచించారు.

ఏలూరు ఎడ్యుకేషన్, మార్చి 4 : దోమల నుంచి వ్యాపించే డెంగీ, మలేరియా జ్వరాలను అరికట్టేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మునిసి పల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాలనాయక్ సూచించారు. శుక్రవారం ఏలూరు జేపీ కాలనీ అర్బన్‌హెల్త్ సెంటర్ పరిధిలోని వీధుల్లో అంటువ్యాధులపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దోమల నివారణకు లార్వాను ధ్వంసం చేసే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే చేస్తున్నారని, ఎవరైనా జ్వరంతో బాధపడితే వెంటనే అర్బన్ పీహెచ్‌సీలో సంప్రదించాలని కోరారు. మునిసిపల్ నోడల్ అధికారిణి డాక్టర్ మాలతి మాట్లాడుతూ పరిసరాల పరిశు భ్రత పాటించడం వల్ల ప్రజలు అనేక అనారోగ్య సమస్యల నుంచి తప్పించు కోవచ్చన్నారు. కరపత్రాలను పంపిణీ చేశారు. పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాలాజీ, అసిస్టెంట్ మలేరియా అధికారి జె.గోవిందరావు, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు.