విష సంస్కృతికి వ్యతిరేకంగా ప్రజా సంఘాల ఆందోళన

ABN , First Publish Date - 2022-12-31T22:46:33+05:30 IST

నూతన సంవత్సరం వేడుకల పేరుతో యువత మందు, విందు, చిందులు వేస్తూ విష సంస్కృతిని తీసుకొస్తున్నారంటూ పీడీఎస్‌యూ, పీవోడబ్ల్యు, పీవైఎల్‌, అరుణోదయ ప్రజాసంఘాలు శనివారం మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించాయి.

విష సంస్కృతికి వ్యతిరేకంగా ప్రజా సంఘాల ఆందోళన
రాస్తారోకో చేస్తున్న ప్రజా సంఘాల నాయకులు

బుట్టాయగూడెం, డిసెంబరు 31: నూతన సంవత్సరం వేడుకల పేరుతో యువత మందు, విందు, చిందులు వేస్తూ విష సంస్కృతిని తీసుకొస్తున్నారంటూ పీడీఎస్‌యూ, పీవోడబ్ల్యు, పీవైఎల్‌, అరుణోదయ ప్రజాసంఘాలు శనివారం మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించాయి. అనంతరం జరిగిన సభలో నాయకులు ఎస్‌.రామ్మోహన్‌, కేవీ రమణ, బి.వినోద్‌, కె.పోతురెడ్డి, కె.అరుణ మాట్లాడుతూ సామ్రాజ్యవాద విష సంస్కృతిని అందరూ వ్యతిరేకించాలన్నారు. నూతన సంవత్సర వేడుకలు యువతను పెడమార్గం పట్టిస్తున్నాయన్నారు. పెట్టు బడిదారులు నూతన సంవత్సర వేడుకలను మార్కెట్‌ శక్తిగా ఉపయోగిం చుకుంటున్నట్లు తెలిపారు. యువత పెడమార్గం పట్టడానికి పాలకవర్గాలే ప్రొత్సాహించడం బాధాకరమన్నారు. నూతన సంవత్సరాన్ని ఉద్యమాల సంవత్స రంగా ఆహ్వానించాలన్నారు.

Updated Date - 2022-12-31T22:46:37+05:30 IST