‘బీసీ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం అభినందనీయం’

ABN , First Publish Date - 2022-12-04T00:09:37+05:30 IST

బీసీ కమ్యూనిటీ హాల్‌ కోసం గ్రామస్థులు, పెద్దలు సహకారంతో సొంత నిధులతో చేపట్టడం అభినందనీయమని ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు.

‘బీసీ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం అభినందనీయం’
పెన్నాడలో శంకుస్థాపన పూజలు చేస్తున్న ఎమ్మెల్యే రామరాజు

పాలకోడేరు, డిసెంబరు 3 : బీసీ కమ్యూనిటీ హాల్‌ కోసం గ్రామస్థులు, పెద్దలు సహకారంతో సొంత నిధులతో చేపట్టడం అభినందనీయమని ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు. పెన్నాడలో ఆధునికీకరణలో భాగంగా పునఃనిర్మిస్తున్న బీసీ కమ్యూనిటీ హాల్‌కు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్‌ ఆధునికీకరణకు ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. టీడీపీ సీనియర్‌ నాయకుడు చేబోలు రామకృష్ణ, పార్టీ మండల అధ్యక్షుడు డీటీ కోటేశ్వరరాజు, పార్టీ గ్రామ అధ్యక్షుడు బైరెడ్డి నరసింహారావు, పార్టీ నాయకులు దొమ్మెటి వేణు, జక్కంశెట్టి మురళి, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.

విస్సాకోడేరు వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యం స్వామి షష్ఠి మహోత్సవాల సందర్భంగా స్వామికి ఎమ్మెల్యే మంతెన రామరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, పెద్దలు ఎమ్మెల్యేను సత్కరించారు. పార్టీ మండల ఉపాధ్యక్షుడు ఎన్‌వీ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-04T00:09:38+05:30 IST