అండర్‌–13 బ్యాడ్మింటన్‌ విజేతలు కర్నూలు, గుంటూరు

ABN , First Publish Date - 2022-09-26T06:22:27+05:30 IST

ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో అండర్‌–13 బాలుర, బాలికల బ్యాడ్మిటన్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలలో బాలికల సింగిల్స్‌లో కర్నూలుకు చెందిన డి.తన్మయి విజేతగా నిలి చింది.

అండర్‌–13 బ్యాడ్మింటన్‌ విజేతలు కర్నూలు, గుంటూరు
విజేతలతో ఏఎస్పీ ఏవీ.సుబ్బరాజు

భీమవరం, సెప్టెంబరు 25: ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో అండర్‌–13 బాలుర, బాలికల బ్యాడ్మిటన్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలలో బాలికల సింగిల్స్‌లో కర్నూలుకు చెందిన డి.తన్మయి విజేతగా నిలి చింది. విజయనగరానికి చెందిన రేణు శ్రీశ్యామలరావు రన్నర్‌గా నిలిచింది. బాలుర విభాగంలో సింగిల్స్‌లో గుంటూరుకు చెందిన బొబ్బ అఖిల్‌రెడ్డి విజేత, చిత్తూరుకు చెందిన కె.నాగచైతన్యరెడ్డి రన్నర్‌గా నిలిచారు. బాలికల డబుల్స్‌ విభాగంలో రేణు శ్రీశ్యామలరావు (విజయనగరం), లక్షీశ్రీ ఆరధ్య (గుంటూరు) విజేతగా నిలవగా, రన్నర్స్‌గా కే శ్రీశ్లోక (నెల్లూరు), సీసీ శ్రీశ్లోక (కడప), బాలుర డబుల్స్‌ విభాగంలో విజేతలుగా బి.అఖిల్‌రెడ్డి (గుంటూరు), బోను అభిషేక్‌ (తూర్పుగోదావరి) నిలవగా రన్నర్స్‌గా ఎస్‌.హేమంత్‌, టి.శేషసాయిశ్రీనివాస్‌ (పశ్చి మ గోదావరి) నిలిచారు. విజేతలకు ఏఎస్పీ ఏవి సుబ్బరాజు బహుమతులు అందించారు. రాష్ట్రస్థాయి విజేతలకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుం దని, జాతీయ స్ధాయిలో కూడా ఇదే స్ఫూర్తితో పాల్గొని రాష్ట్రానికి మంచిపేరు తీసుకురావాలని సుబ్బరాజు అన్నారు.  కళాశాల సెక్రటరీ ఎస్‌ఆర్‌కె నిశాంతవర్మ, ప్రిన్సిపాల్‌ ఎం.జగపతిరాజు మాట్లాడుతూ ఏటా తమ కళాశాల రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు వేదికగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి పి అం కమ్మ చౌదరి, కళాశాల ఉపాధ్యక్షుడు ఎస్‌వి రంగరాజు, డీఎస్పీ శుభాకర్‌, బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి మెంటే వంశీకృష్ణ, వీవీ.సోమరాజు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ పి.సత్యనారాయణరాజు, కోఆర్డినేటర్స్‌ సీహెచ్‌.హరిమోన్‌, జి.సారిక, తదితరులు పాల్గొన్నారు.

Read more